జగన్‌కు ఘన స్వాగతం

జగన్‌కు ఘన స్వాగతం - Sakshi


కోరుకొండ/రాజమండ్రి రూరల్ : రాజమండ్రిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభా పక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం జగన్ మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు వైఎస్సార్ సీపీ శాసన సభాపక్ష ఉప నేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టిరాజా, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎంపీ గిరిజాల వెంకట స్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కుడుపూడి చిట్టబ్బాయి, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, అల్లూరి కృష్ణంరాజు, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్, కాకినాడ పార్లమెంటరీ నాయకుడు చలమలశెట్టి సునీల్ తదితరులు స్వాగతం పలికారు. అలాగే నియోజకవర్గ కన్వీనర్లు ఆకుల వీర్రాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, తోట సుబ్బారావునాయుడు, నగర, మున్సిపాలిటీల ప్రతిపక్ష నాయకులు మేడపాటి షర్మిలారెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస్, కాశి మునికుమారి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జక్కంపూడి రాజా, కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, మింది నాగేంద్ర, కొల్లి నిర్మలకుమారి, ఇసుకపల్లి శ్రీని వాస్, మంచాల బాబ్జీ, వివిధ విభాగాల జిల్లా కన్వీనర్లు అనంత ఉదయభాస్కర్ (బాబు), పెట్టా శ్రీనివాస్, మండపాక అప్పన్నదొర, రాష్ట్ర సేవాధళ్ ప్రధాన కార్యదర్శి సుంకరచిన్ని, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు పోలు కిరణ్ మోహన్‌రెడ్డి, గిరజాల బాబు, గుత్తుల బాబి, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి మిండగుదిటి ఆనంద న్యూటన్, పార్టీ నాయకులు విప్పర్తి వేణుగోపాలరావు, అడపా హరి, రావిపాటి రామచంద్రరావు, శెట్టిబత్తుల రాజబాబు, తాడి విజయభాస్కరరెడ్డి, అత్తిలి సీతారామస్వామి, సత్యనారాయణచౌదరి, వాసిరెడ్డి జమీల్, ఆదిరెడ్డి వాసు, యాదల సతీష్ చంద్ర స్టాలిన్‌తో పాటు పార్టీ అనుబంధ కమిటీల నాయకులు, మండల పార్టీల కన్వీనర్లు కూడా ఘన స్వాగతం పలికారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top