ప్రభుత్వ ఉద్యోగమంటే.. బానిస బతుకేనా ?

ప్రభుత్వ ఉద్యోగమంటే.. బానిస బతుకేనా ?


ప్రభుత్వ ఉద్యోగం అంటే ఐదు అంకెల జీతం.. ఎనిమిది గంటల పని.. కావాల్సిన సెలవులు.. దర్జాజీవితం.. కానీ కాలక్రమంలో పరిస్థితులు

మారిపోతున్నాయి. సుడి ఉంటే కానీ.. దక్కదనే ప్రచారం ఉన్న సర్కారు కొలువు ఇప్పుడు  సుడిగుండం కంటే.. భయంకరంగా తయారవుతోంది.  పైస్థాయిల్లో ఉండే కొందరు రాబందుల కంటే.. ఘోరంగా తమ అధీనం లోని ఉద్యోగులను వేధిస్తుండడంతో వారు

 ఒత్తిడికి గురై.. నరకం అనుభవిస్తున్నారు. మరికొందరు ఏకంగా తనువే చాలిస్తున్నారు.

 

చిత్తూరు (అర్బన్): అనంతపురం జిల్లాకు చెందిన భగీరథరెడ్డి పట్టుపరిశ్రమ శాఖ ఉద్యోగి. హిందూపూర్‌లో పనిచేస్తున్న ఈయన ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక సోమవారం మదనపల్లెలోని హార్సిలీహిల్స్‌కు వెళ్లి 3 వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.



తిరుపతి సమాచారశాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న రామ్‌ప్రసాద్ రోజులో కుటుంబంతో గడిపేది 8 గంటలే. మిగిలిన 16 గంటలు అధికారులకే కేటాయించేశాడు. అయినా సరే శాంతించని ఏడీలు ఇతన్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.



 ప్రస్తుతం జిల్లాలో వినిపిస్తున్న మాటలివి

 ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, వాటి పర్యవేక్షణ బాధ్యతను దర్జాగా అధికారులపై వేసేస్తోంది. అధికారపార్టీ నాయకులు చెప్పినట్లు చేయలేక.. ఉన్నతాధికారి సూచనలు పాటించలేక చాలా మంది ఉద్యోగులు లోలోపల కుమిలిపోతున్నారు. ఒకరిద్దరు ధైర్యంగా ముందుకొచ్చి అధికారుల వేధింపులకు ఎదురు నిలుస్తున్నారు. కానీ లక్షలాది మంది ఉద్యోగులు తమ బా ధల్ని బయటకు చెప్పుకుంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయోనని తీవ్ర ఆవేదనకు గురవుతున్నా రు. ఈ ఆవేదనంతా గుండెల్లో దాచుకుని చి వరకు ఆత్మహత్యలవైపు అడుగులు వేస్తున్నారు. జిల్లాలో ఇటీవల కింది స్థాయి ఉద్యోగుల్ని వేధింపులకు గురిచేసి కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు ఇదే పరిస్థితి.

 

వేధింపులు భరించలేకున్నారు..


మానసిక, శారీరక వేధింపులంటే మొట్ట మొదట గుర్తుకొచ్చేది పోలీసుశాఖ.కానిస్టేబుళ్లకు ఎనిమిది గంటల పని వి ధానం అమల్లోకి వచ్చి ఏడాది దాటుతు న్నా జిల్లాలో ఎక్కడా ఇది కని పించదు.ఇక కొందరు సీఐలు ఎస్సైలను బూతులు తిట్టడం, అదే తీరులో ఎస్సైలు కింది స్థాయి వాళ్లపై విరుచుకుపడటం జరుగుతోంది.హోంగార్డుల పరిస్థితి అయితే మరీ దారుణం.. మొహంపై ఉమ్మేసినా ఎదురు తిరిగి మాట్లాడలేని పరిస్థితి. జిల్లాలో తమ శాఖపై ఓ ఉన్నతాధికారి కక్షసాధింపులకు దిగారంటూ అక్టోబర్ లో రెవెన్యూ ఉద్యోగులంతా విధులు బహిష్కరించి ప్రత్యక్ష ఆందోళనకు దిగారు.చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో తన భర్త చనిపోతే కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వలేదని ఇటీవల ఓ మహిళ కార్యాలయం ఎదుటే ధర్నా చేశారు.



వ్యవసాయశాఖలో ఓ ఉన్నతాధికారి వెకి లి చేష్టలు భరించలేకున్నామని ఇటీవల ఉద్యోగులంతా తీవ్ర ఒత్తిడికి లోనై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమ య్యారు. ఇవి బయటపడ్డ కొన్ని మాత్రమే. జిల్లాలో ప్రతి శాఖలో ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఒక రూపంలో ఉన్నతాధికారుల నుంచి వేధింపులకు గురవుతూనే ఉన్నారు.

 

అసలు ప్రభుత్వ ఉద్యోగమంటే ఏమిటి..?

ప్రభుత్వ ఉద్యోగం.. ఆడపిల్లను ఇచ్చి పెళ్లి చేయడానికి కావాల్సిన ప్రధాన అర్హత ప్రభుత్వ ఉద్యోగి .. రోజుకు 8 గంటలు పనిచేసి హాయిగా ఇంట్లో నిద్రపోవచ్చు ప్రభుత్వ జీతం.. అబ్బో ఒకటో తేదీ వస్తే టపీమంటూ డబ్బు బ్యాంకులో పడిపోతుంది. రిటైర్డ్ ఉద్యోగి... 60 ఏళ్లలో రూ.లక్షలకు లక్ష ల డబ్బు. నెలపెడితే పెన్షన్ సదుపాయం. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.

 

మరి రెండో వైపు..


►అధికారుల కింద కట్టుబానిసగా బతకాల్సిందే.

►ఉన్నతాధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వాళ్ల కాళ్ల దగ్గర వాలిపోవాలి. కుటుంబాన్ని మరచిపోవాలి.

►నెలకు వేలల్లో వచ్చినా కుటుంబ పోషణకు లక్షల్లో అప్పులు చేయడం

►చచ్చినా కుటుంబం కోసం చేసిన అప్పులు తీరక, మళ్లీ అదే బావిలోకి నా అన్నవాళ్లను నెట్టడం..

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top