ఎంసెట్‌లో మెరిసిన కడప తేజాలు


►టెన్త్ ఫలితాల్లో 547 ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత

►రైతు బిడ్డ ప్రవీణ్‌కు మెడిసిన్‌లో 43వ ర్యాంకు

►కాంట్రాక్టరు కుమార్తె కావ్యకు 50వ ర్యాంకు

►విద్యార్థులు, ఉపాధ్యాయుల సమష్టి కృషి ఫలితం

►సర్కారు బడుల్లో 10/10 సాధించిన విద్యార్థులు

►సెమీ ఎయిడెడ్ నుంచి 16 మందికి 10/10 జీపీఏ

 

చదివింది సర్కారు బడుల్లోనే. అయితేనేం...? పదో తరగతి పరీక్షల్లో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఫలితాలు సాధించి రికార్డు సృష్టించారు రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. ప్రైవేటు పాఠశాలలో చదివితేనే మెరుగైన ఫలితాలు వస్తాయన్నది అపోహేనని రుజువు చేశారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని మరోసారి నిరూపించారు. ఇటీవలి పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో ఏకంగా 547 ప్రభుత్వ పాఠశాలలు వంద శాతం ఫలితాలను సాధించడం విశేషం. దీని వెనక విద్యార్థుల ప్రతిభ ఎంతుందో... మట్టిలోని ఆ మాణిక్యాలను వెలికితీయడంలో, సానబట్టి గెలుపు బాట పట్టించడంలో ఉపాధ్యాయుల కృషీ అంతే ఉంది. 13 మంది ప్రభుత్వ జిల్లా పరిషత్, గురుకుల  పాఠశాలల విద్యార్థులతో పాటు 16 మంది సెమీ ఎయిడెడ్ స్కూళ్ల విద్యార్థులు కూడా 10/10 జీపీఏ పొందడం విశేషం.


గ్రామీణ ప్రాంతాల్లో, అది కూడా సరైన సౌకర్యాలు లేని చోట.. ఆర్థిక ఇబ్బందులున్న కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు సర్కారు బడుల్లో ఇలా అద్భుత ఫలితాలు సాధించడం వెనుక కారణాలను వెలికి తీయనుంది ‘సాక్షి’. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులు, వెన్నంటే ఉండి వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులు, పక్కా ప్రణాళికలతో ముందుండి నడిపించిన ప్రధానోపాధ్యాయుల అభిప్రాయాలతో రేపటి నుంచి వరుస కథనాలను అందించనుంది...

 

ప్రైవేటుకు ధీటుగా..

 

తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటు పాఠశాలల నుంచి 2,43,719 మంది పరీక్షలు రాయగా 2,01,013 మంది (82.47 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వంలోని అన్ని మేనేజ్‌మెంట్ల (జిల్లా పరిషత్తు, గవర్నమెంట్, గురుకులాలు, ఎయిడెడ్) నుంచి 2,39,754 మంది పరీక్షలు రాయగా 1,97,254 మంది (82.27 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కంటే తామేమీ తీసిపోమని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిరూపించారు.



ప్రభుత్వ పాఠశాల్లో 10/10 సీజీపీఏ సాధించిన విద్యార్థులు వీరే



హాల్ టికెట్                    పేరు                                   జిల్లా



1541127390         డి.కావేరి                             మహబూబ్‌నగర్

1537129578        కె.దేవేందర్                          రంగారెడ్డి

1529122094        జంగంపల్లి రాము               నిజమాబాద్

1533119253        దుర్గం నందిని                     కరీంనగర్

1533130556        అల్లంకి సంతోష్                  కరీంనగర్

1532108538        అజ్మీరా కోటేశ్వర్‌రావు        వరంగల్

1531116187        అజ్మీరా సృజన                    వరంగల్

1530102425        జి. శ్రీ ప్రీతి వీక్షిత                 ఖమ్మం

1530108301        బి.సరిత                             ఖమ్మం

1527126047        చిట్టెం వికాస్                        నల్లగొండ

1526110113        అజయ్‌కుమార్ రెడ్డి             నల్లగొండ

1526106961        బడుగు శివాణి సరస్వతి        నల్లగొండ

1527107824        ఓరుగంటి చక్రి                     నల్లగొండ



 ప్రభుత్వ ఆధీనంలోని వివిధ మేనేజ్‌మెంట్ బడుల్లో వంద శాతం ఫలితాలు సాధించినవి.

 

జిల్లా                             ప్రభుత్వ    జిల్లా పరిషత్తు     రెసిడెన్షియల్    


 

మహబూబ్‌నగర్                20                  93                  11        

 రంగారెడ్డి                          0                      1                   0        

 హైదరాబాద్                       3                    0                    0        

 మెదక్                            12                  59                    7        

 నిజమాబాద్                      7                   46                  4        

 ఆదిలాబాద్                       3                     7                   1        

 కరీంనగర్                        7                    33                   6                    

 వరంగల్                        21                    77                  18        

 ఖమ్మం                        14                    20                    2        

 నల్లగొండ                       12                   49                   9        

 మొత్తం                         99                  385                58        

 

పాఠశాలల వారీగా వివరాలు..



 స్కూళ్లు                             సంఖ్య        వంద శాతం ఫలితాలు

 మొత్తం స్కూళ్లు                  10,982                1,491

 ప్రైవేటు స్కూళ్లు                     5,425                  944

 ప్రభుత్వ స్కూళ్లు                    5,557                 547    




 మొత్తం ప్రభుత్వ స్కూళ్లలో..

 జిల్లా పరిషత్తు                          4,052      385

 ప్రభుత్వ                                  1,015        99

 తెలంగాణ గురుకులాలు                65         22

 సాంఘికసంక్షేమ గురుకులాలు     120       27

 గిరిజన సంక్షేమ గురుకులాలు         72          9

 ఎయిడెడ్                              230         5



పేదింట్లో వికసించిన విద్యాకుసుమం



అమ్మానాన్నలు వ్యవసాయ కూలీలు... చదివింది సర్కారు బడిలో...అయితేనేం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం..  చదువుకోవాలనే తపనతో ఇటీవల పది ఫలితాల్లో 9.3 జీపీఏ సాధించింది నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని నీరుడు శిరీష. భవిష్యత్తులో ఇంజనీర్ కావాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది.

 

ఆటోవాలా తనయకు 10 జీపీఏ..



 ఖమ్మం జిల్లా తెల్దారుపల్లికి  చెందిన ఆటో డ్రైవర్ బోడపట్ల వెంకన్న కూతురు సరిత. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 10/10 జీపీఏ సాధించింది. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది. పదో తరగతిలో పదికి పది జీపీఏ రావడం సంతోషంగా ఉంది. ఇంజనీర్ అవడం భవిష్యత్తు లక్ష్యమని చెబుతోంది.




సర్కారీ స్కూళ్లు అనగానే ఓ చిన్నచూపు.. పంతుళ్లు చదువు సరిగ్గా చెప్పరని ఓ అపవాదు! కానీ ఇటీవలి టెన్త్ ఫలితాలు వీటన్నింటినీ కొట్టిపడేశాయి. ప్రైవేటుకు ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రభుత్వ పాఠశాలలు జైత్రయాత్ర సాగించాయి. విద్యార్థుల దీక్షకు ఉపాధ్యాయుల అవిరళ కృషి తోడవడంతో మట్టిలో మాణిక్యాలు మెరిశాయి. బాగా చదవాలంటూ వెన్నుతట్టడమే కాదు.. అనుక్షణం వారికి ప్రేరణ అందిస్తూ విజయపథంలో సాగేందుకు టీచర్లు పడ్డ తపన ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. టీచర్ల ప్రత్యేక శ్రద్ధ వల్లే తాము ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా మంచి మార్కులు తెచ్చుకున్నామంటున్నారు విద్యార్థులు. ఉత్తమ బోధనతో తమను ఉన్నత స్థానంలో నిలిపిన గురువుకు మనస్ఫూర్తిగా ‘థాంక్యూ సార్.. థాంక్యూ టీచర్’ అని చెబుతున్నారు! విద్యార్థుల విజయపథం వెనుక ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చేసిన కృషిపై కథనం...

 

  సిర్సవాడ.. 100% పాస్

 సాక్షి, హైదరాబాద్: సిర్సవాడ.. మహబూబ్‌నగర్ జిల్లా తాడూరు మండలంలోని గ్రామం. పరిసరాల్లో మరో ఏడెనిమిది పల్లెల విద్యార్థులంతా సిర్సవాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే చదువుతారు. ఈ స్కూలు ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖరరెడ్డి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. తోటి ఉపాధ్యాయుల సహకారం, పక్కా ప్రణాళికతో పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యేందుకు (వంద శాతం ఫలితాల సాధనకు) ఎంతగానో శ్రమించారు. బాగా చదవాలంటూ ప్రోత్సహించడమే కాదు పరీక్షలు రాయబోతున్న పదో తరగతి విద్యార్థులకు స్కూల్లోనే నివాస వసతి ఏర్పాటు చేశారు. అందరూ బాగా చదివారు. వంద శాతం ఫలితాలను సాధించారు. 57 మంది విద్యార్థుల్లో 32 మంది బాలురు, 25 మంది బాలికలు. అంతా ఉత్తీర్ణులయ్యారు. 16 మంది 9 జీపీఏ సాధించారు.

 

  ఫలితాల కోసం ఆత్రుతగా చూసిన హెచ్‌ఎం

 ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొత్తపల్లి వెంకట్‌రెడ్డి ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. ‘విద్యార్థుల కంటే నేనే ఎక్కువ ఆత్రుతగా చూశాను. ఏడాది పాటు పదో తరగతి విద్యార్థుల కోసం ప్రణాళికాబద్ధంగా సాగించిన ఫలితం రిజల్ట్స్ ద్వారానే తెలిసేది’ అని ఆయన అన్నారు. ఈ పాఠశాలలో చదివిన సరిత 10 జీపీఏ సాధించి ప్రశంసలు అందుకుంది. స్థానికంగా ఆటో నడుపుకునే వ్యక్తి కూతురు సరిత. ఆమెను ఉన్నతస్థానంలో నిలిపేందుకు టీచర్లు కృషి చేశారు. విద్యార్థులందరికీ బోధన ఒకే తీరులో ఉండేదని, అయితే, బాగా చదివేవారిని దృష్టిలో పెట్టుకుని ప్లానింగ్ చేయడంతో ఊహించినట్లే సరిత 10 జీపీఏ సాధించిందని వెంకట్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.

 

  సవాల్‌గా తీసుకున్నాం

 నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయరావు మారిన సిలబస్‌కు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేసేందుకు ప్రత్యేకమైన ప్రణాళిక  సిద్ధం చేశారు. తోటి ఉపాధ్యాయులను ఉత్తేజపరుస్తూ ఆయన చేసిన కృషి ఫలించింది. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు అనేక మంది 8 అంతకంటే ఎక్కువ జీపీఏ సాధించారు. ‘హిందీ, సోషల్‌కు టీచర్లు లేకున్నా ఉన్న టీచర్లకు అదనపు బాధ్యతలు అప్పజెప్పి సబ్జెక్ట్ వారీగా ప్రతిరోజు టెస్ట్‌లు పెట్టాం. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం.’ అని విజయరావు చెప్పారు.

 

  శ్రీరంగాపూర్.. హెచ్‌ఎం, టీచర్ల ఉమ్మడి కృషి

 మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలది మరో విజయగాథ. ఈ స్కూల్లో చదివిన ముగ్గురు విద్యార్థులు టెన్త్‌లో 9.5 జీపీఏ సాధించారు. వారి ఫలితాల వెనుక ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల కృషి దాగుంది. ‘నేను, మా ఉపాధ్యాయులం అందరం ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. చదువులో ముందున్న వారిని ఒక బ్యాచ్‌గా, కాస్త వెనుకబడ్డ వారిని మరొక బ్యాచ్‌గా చేసి వారి తెలివితేటలకు తగ్గట్టు పాఠ్య ప్రణాళిక సాగించాం. ఈ విజయం వెనుక మా ఉపాధ్యాయుల క్రెడిట్‌తో పాటు విద్యార్థుల శ్రమ కూడా ఉంది’ అని ప్రధానోపాధ్యాయుడు చెప్పారు. ఈ క్రెడిట్ ఏ ఒక్కరిదో కాదని, అందరిదీ సమాన కృషి అంటూ ఆయన తన పేరు వాడుకునేందుకు కూడా అంగీకరించలేదు. ‘మా పాఠశాలలో హెచ్‌ఎంతో పాటు అన్ని సబ్జెక్ట్‌ల ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధ చూపారు. ప్రత్యేక తరగతులు నిర్వహించి, ప్రోత్సాహం అందించారు’ అని 9.5 జీపీఏ సాధించిన విద్యార్థుల్లో ఒకరైన ప్రవీణ ఆనందంతో చెప్పింది.

 

  చౌటుప్పల్‌లో నూటికి నూరు శాతం

 టీచర్ల ఉమ్మడి కృషితో నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లోని గురుకుల పాఠశాల నూటికి నూరు శాతం ఫలితాలు సాధించింది. ‘విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయుల సమష్టి కృషితోనే నూరు శాతం ఉత్తీర్ణత సాధించాం. 79 మందికి గాను 79 మంది ఉత్తీర్ణులయ్యారు. శివాని సరస్వతి అనే విద్యార్థిని 10కి 10 పాయింట్లు సాధించింది. విద్యార్థులతో కలిసిపోయి, ఉపాధ్యాయులంతా కృషి చేయడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయి’ అని పాఠశాల ప్రిన్సిపాల్ పి.విద్యాసాగర్ చెప్పారు.

 

  బుసిరెడ్డిపల్లి.. ప్రణాళికాబద్ధ బోధన

 మహబూబ్‌నగర్ జిల్లాలోనే పాన్‌గల్ మండలంలోని బుసిరెడ్డిపల్లిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తమ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఇక్కడి ప్రధానోపాధ్యాయుడు రాఘవేంద్రరావు విశేష కృషి చేశారు. తోటి ఉపాధ్యాయుల సహకారంతో పదో తరగతి ప్రారంభం నుంచే ప్రణాళికబద్ధంగా విద్యాబోధన సాగేలా చూశారు. ఒక్క విద్యార్థి బడికి రాకపోయినా టీచర్లను తోటి విద్యార్థులను పంపి కారణాలు తెలుసుకునేవారు. అనారోగ్యం అయితే తప్ప కావాలని ఎగ్గొడితే బతిమాలి వారిని తీసుకొచ్చేవారు. సకాలంలో సిలబస్ పూర్తి కాకపోతే ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు చెప్పించేవారు. వీరి ఉమ్మడి కృషి కారణంగా ఆ స్కూలు విద్యార్థిని ఎస్.సింధూజ మొన్నటి పదో తరగతి ఫలితాల్లో ఏకంగా 9.8 జీపీఏ సాధించింది. రాష్ట్ర స్థాయిలో మొదటి 500 మందిలో సింధూజ ఒకరుగా నిలిచారు.

 

  టీచర్ల సాయంతో వైకల్యం అధిగమించి..

 వరంగల్ జిల్లా దేవరప్పుల మండల దారావత్ తండాలో వ్యవసాయ కుటుంబానికి చెందిన దారావత్ సజ్జన్ నాయక్ రెండో కుమారుడు దారావత్ స్వామి. పుట్టుకతో చేతులు సరిగా లేవు. వంకర కాళ్లతో జన్మించాడు. మొదట్లో కాళ్లతో కట్టెలను పట్టుకుని భూమిపై గీతలు గీసిన స్వామిని చూసి తల్లిదండ్రులు ఆరో ఏట బడిబాట పట్టించారు. తండాలోనే ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులు వెంకన్న, జ్యోతి.. స్వామికి మనోధైర్యం అందించి కాళ్లతో బలపం పట్టించి చదువుకు శ్రీకారం చుట్టించారు.

 

 ఇలా ఏడో తరగతి పూర్తి చేసిన స్వామి పదికిలోమీటర్ల దూరంలోని కడవెండి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మారాడు. చదువుపై స్వామికి ఉన్న మమకారాన్ని చూసిన అక్కడి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు స్థానికంగా ఉన్న ‘జాన్‌డీబ్రీట్టో’ అనే ప్రైవేటు స్కూలు యాజమాన్యంతో మాట్లాడి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. మూడేళ్ల పాటు ఆ పాఠశాల టీచర్లు వెంకటేశ్వర్లు, కేదారీ, హెచ్‌ఎం ఖదీర్‌మీయా స్వామి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. చేతులు లేకపోయినా కాళ్లతో పరీక్ష రాసి పదో తరగతి పాసయ్యేలా చూడాలన్న ఆ ఉపాధ్యాయుల కల నెరవేరింది. పదో తరగతి పరీక్షల్లో స్వామి 6.7 జీపీఏ సాధించి శభాష్ అనిపించుకున్నాడు.


కడప విద్యా కుసుమాలు

ఎంసెట్ ఫలితాల్లో కడప జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మంచి ర్యాంకులు సాధించి.. సరస్వతీ పుత్రులమని చాటిచెప్పారు. తామెప్పుడూ చదువుల్లో ఆణిముత్యాలమేనంటూ పేదింటి బిడ్డలు మరోసారి రుజువు చేశారు. కష్టపడి చదివి తల్లిదండ్రుల కళ్లల్లో కాంతి నింపారు.. తమ లక్ష్యం వైపు అడుగు ముందుకేశారు. గురువారం వెలువడిన ఎంసెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ర్యాం‘కింగ్’లుగా నిలిచి అదుర్స్ అనిపించారు.

     

 సాక్షి, కడప : కష్టే ఫలి.. పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏదీ లేదని పలువురు విద్యార్థులు నిరూపిస్తున్నారు. మైదుకూరు మండలం లెక్కలవారిపల్లెకు చెందిన లెక్కల ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తండ్రి రాజశేఖరరెడ్డి, తల్లి అమ్మణ్ణెమ్మ తమకున్న రెండు ఎకరాల పొలంలో అనునిత్యం కష్టపడుతూ బిడ్డ ప్రవీణ్‌ను తిరుపతిలో శ్రీచైతన్య కళాశాలలో చదివిస్తున్నారు. తల్లిదండ్రుల శ్రమను కనులారా చూసిన ప్రవీణ్ మొక్కవోని ధైర్యంతో.. పట్టుదలతో చదివి మెడిసిన్‌లో 43వ ర్యాంకు సాధించి చరిత్ర సృష్టించాడు.



రాజంపేట పరిధిలోని ఆకేపాడు కట్టకిందపల్లెకు చెందిన కావ్య మెడిసిన్‌లో 50వ ర్యాంకు సాధించి విజయకేతనం ఎగురవేసింది. తండ్రి కాంట్రాక్టు పనిచేస్తూ కుమార్తెను చదివిస్తున్నాడు. కడపకు చెందిన సాయికీర్తన కూడా మెడిసిన్‌లో 119వ ర్యాంకు సాధించింది. పులివెందుల బాకరాపురానికి చెందిన యజ్ఞప్రియానందన్‌రెడ్డి మెడిసిన్‌లో 181వ ర్యాంకు సాధించి అబ్బురపరిచాడు. కడప నాగరాజపేటకు చెందిన చందన ఇంజనీరింగ్‌లో 213వ ర్యాంకు సాధించింది. అనారోగ్యంతో చందన తండ్రి చాలా ఏళ్ల క్రితం చనిపోయినా.. తల్లి శ్రీదేవి ప్రోత్సాహంతో  ఎంసెట్‌లో అత్యుత్తమ విజయం సాధించింది.

     

 

 విహాంత్‌రెడ్డికి మెడిసిన్ లో 37వ ర్యాంకు

 వైవీయూ: కడప నగరానికి చెందిన మౌని విహాంత్‌రెడ్డి ఎంసెట్ ఫలితాల్లో మెడిసిన్ విభాగంలో 37వ ర్యాంకు సాధించి భళా అనిపించాడు. నగరంలోని భార్గవ్ బేరియం సాల్ట్ అధినేత వి. వెంకటసుబ్బారెడ్డి కుమారుడైన  ఇతను ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని నారాయణ విద్యాసంస్థల్లో పూర్తిచేసి 987 మార్కులు సాధించాడు. తాజాగా విడుదలైన మెడిసిన్ ఫలితాల్లో 149 మార్కులతో రాష్ట్రస్థాయిలో 37వ ర్యాంకు, ఎస్వీయూ పరిధిలో 3వ ర్యాంకు సాధించడం విశేషం.  విద్యార్థి ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఆయన తల్లి ఇందిరమ్మ మరణించారు. దు:ఖాన్ని దిగమించి ఇంత మంచి ర్యాంకు సాధించడంపై పలువురు ఆయన్ను అభినందించారు.   

 

 సివిల్స్ సాధనే ధ్యేయం..

 మెడిసిన్‌లో కార్డియాలజీలో స్పెషలైజేషన్ చేయాలని ఉంది. త్వరలో రానున్న ఎయిమ్స్ ఫలితాల్లో సైతం మంచి ర్యాంకు వస్తుందని అనుకుంటున్నా. భవిష్యత్‌లో సివిల్స్ సాధించి ప్రజలకు చేతనైన మేర సాయం అందించడమే లక్ష్యం.  మంచి స్థానంలో ఉండి ప్రజలకు సేవచేయాలన్న తల్లి లక్ష్యాన్ని సాధించేందుకు కృషిచేస్తా.

     - మౌని విహాంత్‌రెడ్డి ,  ఎంసెట్  ర్యాంకర్

 

 కడ ప ఎడ్యుకేషన్ :  కడప నగరానికి చెందిన విద్యార్థిని కందుల కీర్తన కిరణ్ ఎంసెట్ మెడిసిన్ విభాగంలో 119వ ర్యాంకు సాధించింది. కందుల కీర్తన కిరణ్ తండ్రి కె. బి, కిరణ్‌కుమార్ ఎల్‌ఐసీలో ఉద్యోగం చేస్తున్నారు, త ల్లి శశిప్రభ గృహిణి. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో కీర్తన కిరణ్  ఎంసెట్ టాంగ్‌టర్మ్‌లో ఈ విజయం సాధించింది. కీర్తన హైద రాబాదు పబ్లిక్ స్కూల్లో విద్యానభ్యసించే రోజుల్లో స్పోర్స్ కెప్టెన్‌గా కూడా  వ్యవహరించడం విశేషం. వాబబాల్, ్రత్రోబాల్ మరియు టెన్నికాయిట్‌లో ప్రావీణ్యం ఉండటంతోపాటు ఎన్నో బహుమతులను కూడా సాధించింది.  



 కార్డియాక్ సర్జన్ అవుతా..

 ప్రస్తుతం న్యూఢిల్లీ, పాండుచేరిలోని జిమ్మర్ మెడికల్ కళాశాల ఎంట్రెన్ పరీక్షలకు ప్రిపేరవుతున్న కీర్తణ ఎంబీబీఎస్ పూర్తి చేసి ఒక నిష్ణాతురాలైన కార్డియాక్ సర్జన్ కావడమే  లక్ష్యమన్నారు.

 

 శభాష్.. హరీష్

 మైదుకూరు టౌన్:   సాధారణ రైతు బిడ్డ ఎంసెట్ ఫలితాల్లో దుమ్మురేపాడు.  మెడిసిన్ ఫలితాల్లో స్టేట్ 43వ ర్యాంక్ సాధించి శభాష్ అనిపించాడు. మైదుకూరు మండలం లెక్కలవారిపల్లె గ్రామానికి చెందిన లెక్కల రాజశేఖర్‌రెడ్డి అమ్మణ్ణమ్మ కుమారుడు లెక్కల హరీష్‌కుమార్‌రెడ్డి. కొడుకును  ఉన్నతస్థానంలో చూడాలన్న లక్ష్యంతో తండ్రి తనకున్న 2ఎకరాల పొలం సాగుచేస్తూ చదివిస్తున్నాడు.  తండ్రి కష్టం కళ్లారా చూసిన హరీష్ ఆయన తనపై పెట్టుకున్న ఆశల్ని.. ఆశయాల్ని వృథా చేయలేదు. కష్టపడి చదివి ర్యాంకుల పంట పండించాడు. పదో తరగతి మైదుకూరు శ్రీశారదా హైస్కూల్‌లో,  తిరుపతి శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో చదివిన హరీష్..   స్టేట్ 43వ ర్యాంక్ సంపాదించి తండ్రి కళ్లల్లో కాంతి నింపాడు.



 ప్రజాసేవే లక్ష్యం..

 ఎంసెట్ ర్యాంకర్ హరీష్ మాట్లాడుతూ పేద లకు సేవచేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. తనకు వెన్నెముకగా నిలిచిన  తల్లిదండ్రులకు , సహకరించిన శ్రీ చైతన్య తిరుపతి విద్యాసంస్థకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపాడు.

 

 రాజంపేట విద్యార్థినికి 50వ ర్యాంకు

 రాజంపేట: రాజంపేట మండలం ఆకేపాడు పంచాయతీ కట్టకిందపల్లెకు చెందిన వీరంరెడ్డి.శివరామిరెడ్డి(శివారెడ్డి), లక్ష్మీదేవి కుమార్తె వీరంరెడ్డి కావ్య ఎంసెట్ మెడిసిన్‌లో 50వ ర్యాంకు సాధించింది. 153 మార్కులకు 146 మార్కులు వచ్చాయి. హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కాలేజి(ఎస్‌ఆర్ నగర్ బ్రాంచి)లో ఇంటర్‌లో బైపీసీ పూర్తి చేసింది. ఇంటర్‌లో 1000కి 981 మార్కులు వచ్చాయి. టెన్త్‌లో 10కి10 జీపీఏ ఉత్తీర్ణత సాధించింది. తన మనవరాలికి ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడంపై తాత వీరంరెడ్డి వెంకటరెడ్డి , కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తంచేశారు.

 

 పులివెందుల విద్యార్థికి 181వ ర్యాంకు

పులివెందుల టౌన్: పట్టణంలోని స్థానిక బాకరాపురంలో నివసిస్తున్న ఎన్.ఈశ్వరరెడ్డి, శివపార్వతిల కుమారుడు ఎన్.యజ్ఞప్రియానందన్‌రెడ్డి ఎంసెట్ మెడిసిన్‌లో 181వ ర్యాంకు సాధించి సత్తాచాటాడు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఇతను  పులివెందుల స్వామి వివేకానంద పాఠశాలలో 10వ తరగతి, విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ చదివాడు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించడంపై కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు.

 

 ‘యాపరాళ్ల’.. మార్కుల్లో భళా..

 ‘ఇంజనీరింగ్’లో  217 ర్యాంకు సాధించిన యాపరాళ్ల చందన

 కడప ఎడ్యుకేషన్ :  కడప నగరానికి చెందిన మాపరాళ్ల చందన ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా 217, రాయలసీమ జోన్‌లో 1 వ ర్యాంకును సాధించి సత్తా చాటింది. నాగరాజుపేలకు చెందిన రవి, శ్రీదేవిల రెండవసంతానం యాపరాల చందన. తండ్రి కొన్నేళ్ల క్రితమే చనిపోగా తల్లి సంరక్షణలో పెరుగుతూ..శ్రద్ధగా చదువుతూ మార్కుల పంట పండించింది.   కడపలోని పుష్పగిరి పాఠశాలలో పదో తరగతి చదివిన చందన 9.7 గ్రేడ్ సాధించింది. ఇంటర్‌ను నారాయణలో 979 మార్కులతో విజయం సాధించింది.  

 ఐఈఎస్ లక్ష్యోం: ఐఈఎస్‌ను పూర్థిచేసి ఇంజనీర్ కావటమే లక్ష్యమని చందన పేర్కొన్నారు.

 

 మెడిసిన్‌లో 89వ ర్యాంక్  

 పెద్దముడియం: పెద్దముడియం మండలం జంగాలపల్లె గ్రామానికి చెందిన కాటసాని గిరిధర్‌రెడ్డి అనే విద్యార్థి ఎంసెట్ పరీక్షా ఫలితాల్లో 89వ  ర్యాంక్ సాధించినట్లు తండ్రి కాటసాని దస్తగిరిరెడ్డి పేర్కొన్నారు. గురువారం వెలువడిన ఎంసెట్ పరీక్షల ఫలితాల్లో 153 మార్కులకు గాను 144 మార్కులు రావడంతో రాష్ట్ర స్థాయిలో మెడిసిన్‌లో 89వ ర్యాంకు వచ్చిందన్నారు.  తమ గ్రామవాసి రాష్ట్ర స్థాయిలో 89వ ర్యాంక్‌ను మెడిసిన్‌లో రావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top