గందరగోళం!

గందరగోళం!


చీపురుపల్లి: చీపురుపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుపై గందరగోళం నెలకొంది. స్థానిక ప్రజాప్రతినిధులు కళాశాలను ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నప్పటికీ.. అధికారుల తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. కళాశాల మంజూరై సుమారు ఏడాది కావస్తున్నా.. ఇప్పటివరకు అధికారులు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్థానికంగా ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో కళాశాలను తాత్కాలికంగా విజయనగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇక్కడ సీట్లు పొందిన విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు.

 

 చీపురుపల్లికి మంజూరైన ప్రభుత్వ పాలిటెక్నిక్  కళాశాలను విజయనగరంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహా లు చేస్తున్నారు. వాస్తవానికి గత ఏడాది చీపురుపల్లికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరైంది.2014- 15 విద్యా సంవత్సరానికి సంబంధించి అధికారులు ఈ కళాశాల పేరును కౌన్సెలింగ్ జాబి తాలో కూడా చేర్చారు. దీంతో చీపురుపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన గ్రా మీణ ప్రాంత విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. చీపురుపల్లి పేరుతో ప్రభుత్వ పాలి టెక్నికల్ కళాశాల మంజూరైనప్పటికీ ఇంతవరకు చీపురుపల్లిలో కళాశాల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అంతేకాకుండా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్  కళాశాలలో చీపురుపల్లి కళాశాలను కూడా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

 

 దీంతో ఈ ప్రాంతానికి చెందిన విద్యార్థులు, ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని కలెక్టర్, ఉన్నత విద్యాశాఖ ఆర్‌జేడీలతో కొద్ది రోజుల క్రితం ఫోన్‌లో మాట్లాడి, పాలిటెక్నికల్ కళాశాలను చీపురుపల్లిలోనే ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ ఫలితం లేకపోతోంది. వాస్తవానికి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ఏడాది పాలిటెక్నిక్ , ఇంజినీరింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదాస్పదమైన విషయం తెలి సిందే. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరికొద్ది రోజుల్లో తరగతులు ప్రారంభంకానున్న తరుణంలో చీపురుపల్లి పాలిటెక్నిక్  కళాశాల పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.

 

 కళాశాల తాత్కాలిక ఏర్పాటుకు అవసరమైన భవనాలు కూడా స్థానిక జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కేటాయిం చారు. సొంత భవనం ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణలో ప్రజాప్రతినిధులు ఉన్నారు.అయినప్పటికీ సాం కేతిక విద్యా అధికారులు కళాశాల ఏర్పాటు విషయంలో నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యా రంగంలో ఎంతో వెనుకపడి ఉన్న చీపురుపల్లికి పాలిటెక్నికల్ కళాశాల మం జూరు కావడం వరమే అయినప్పటికీ కళాశాల ఏర్పాటులో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్దగా దృష్టిసారించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే మృణాళిని రాష్ట్ర స్థాయిలో మంత్రి గా ఉన్నప్పటికీ కళాశాల ఏర్పాటులో జాప్యం జరుగుతోం దంటే స్థానిక ప్రజాప్రతినిధులు అలసత్వం కూడా స్పష్టంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.     ఇప్పటికైనా పాలకులు స్పందించి చీపురుపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top