ప్రజల గోడు పట్టని ప్రభుత్వం

ప్రజల గోడు పట్టని ప్రభుత్వం


- 3లక్షల కార్డుల తొలగించేందుకు యత్నం

- ఎమ్మెల్యే నారాయణస్వామి ఆవేదన

పెనుమూరు :
రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నా సర్కారుకు చీమకుట్టినంత కూడా లేదని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామి మండిపడ్డారు.శనివారం మండలంలోని కత్తిరెడ్డిపల్లెలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతున్నామంటున్న ప్రభుత్వం త్వరలో జిల్లాలో 3 లక్షల రేషన్‌కార్డులను తొలగించి పేదల నోట్లో మట్టికొట్టనుందని చెప్పారు. ప్రజల బాగోగులు మరిచి ఇతరులపై బురద జల్లేందుకు కొన్ని పత్రికలు కుట్రలు పన్నుతున్నాయని చెప్పారు. 2014 ఎన్నికల్లో తాను 20 వేల ఓట్లతో ఓడిపోతానంటూ దుష్ర్పచారం చేసిన ఎల్లో మీడియా ఎన్నికలయ్యాక 20 వేల ఓట్లతో గెలిచినట్లు గుర్తు చేశారని చెప్పారు.



ఇప్పుడు కూడా తాను ఎమ్మెల్యేగా ఫైయిల్ అని సర్వే చేసి ప్రజలను మభ్య పెట్టడానికి చూస్తోందని మండిపడ్డారు. తనపై తప్పడు సంకేతాలు ప్రజలకు చేరవేస్తున్నట్లు అసహనం వ్యక్తం చేశారు.అసలు ఈ సర్వే ఎలా చేశారు.. ఎవరినుద్దేశించి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యకర్తకు అవసరం వచ్చినా తక్షణమే స్పందిస్తున్నట్లు తెలిపారు. కుట్రలతో తనకున్న ప్రజాదరణను అడ్డుకోలేరని హితవు పలికారు. పార్టీ  మండల అధ్యక్షుడు మహాసముద్రం సురేష్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి నరిసింహారెడ్డి, రైతు సంఘం మండల అధ్యక్షుడు గోవిందరెడ్డి, నాయకులు మార్కొండారెడ్డి, కొర్రావీర్రాఘవులు, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top