కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం


 శ్రీకాకుళం అర్బన్: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. మేడే సందర్భంగా వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి.జీవరత్నం ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జెండాను రెడ్డి శాంతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులందరికీ సమానహక్కులు లభించిననాడే మేడేకు అర్థం లభిస్తుందన్నారు.

 

 80 దేశాల్లో మేడే పండుగను నిర్వహిస్తున్నారని, మనదేశంలో 1923 నుంచి నిర్వహిస్తున్నామన్నారు. ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జీవరత్నం మాట్లాడుతూ జిల్లాకు చెందిన కింజరాపు అచ్చెన్నాయుడు కార్మికశాఖమంత్రిగా ఉండి కూడా పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల ఆరోగ్యం కోసం రెండేళ్లుగా ఈఎస్‌ఐ ఆస్పత్రి అంటున్నారే తప్ప అమలుకు నోచుకోవడం లేదన్నారు. వైఎస్ హయాంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం చట్టం చేశారని, దీనికి తూట్లు పొడిచే విధంగా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.

 

 అనంతరం దివంగత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయం వైఎస్సార్ కూడలి వరకూ ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో పార్టీ కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, అధికార ప్రతినిధి ఎన్ని ధనుంజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవీ పద్మావతి, గ్రీవెన్స్‌సెల్ కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్, నాయకులు మూకళ్ల తాతబాబు,టి.కామేశ్వరి,ట్రేడ్ యూని యన్ నాయకులు సీహెచ్.భాస్కరరావు, సుగ్గు చత్రపతిరెడ్డి, ఆసి పురుషోత్తమరెడ్డి, రౌతు శ్రీరామ్మూర్తి, ఎస్.ధర్మారావు, కె.రాంబాబునాయుడు, బరాటం నాగరాజు, సుధాకర్ గుప్తా, సూరినాయుడు, ఎ.వెంకటపతిరాజు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 ప్రెస్‌క్లబ్‌లో...

 ప్రపంచంలోని బానిస వ్యవస్థకు స్వస్థి పలికే ఉద్యమమే మేడే అని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు అన్నారు.  శ్రీకాకుళంలోని గరిమెళ్ల భవన్ (ప్రెస్‌క్లబ్)లో మేడే ఉత్సవాన్ని నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు ఎర్రజెండా ఎగురవేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన జర్నలిస్టుల పిల్లలకు ప్రోత్సాహక బహుమతులు, నగదు పారితోషికాలు ఇవ్వాలని తీర్మానించారు. అర్హత గలవారు ప్రెస్‌క్లబ్ ప్రతినిధులను సంప్రదించాలని కోరారు. క్లబ్ అధ్యక్షుడు బగాది అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎన్. ఈశ్వరరావు, బగాది శ్రీరామమూర్తి, కేవీ రమణమూర్తి, గురుగుబెల్లి రాజేశ్వరరావు, మల్లేశ్వరరావు, పైల శ్రీనివాసరావు, శృంగారం ప్రసాద్, పి.యోగేశ్వరరావు, గణపతిరావు, ఎస్.వరదరాజులు, పాతిన వరహాలనాయుడు, సతీష్, మురళి, వేణు పాల్గొన్నారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top