జిల్లాపై ప్రభుత్వానికి వివక్ష

జిల్లాపై ప్రభుత్వానికి వివక్ష - Sakshi


 రాజంపేట : జిల్లాపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష కొనసాగుతోందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో నూనివారిపల్లెలో బిల్డింగ్‌సొసైటీ ఉపాధ్యక్షుడు (టీడీపీ) పెనగలపాటి పెంచలయ్యనాయుడు ఆధ్వర్యంలో 70మందికిపైగా  వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా సభ నిర్వహిం చారు. ఈ సభలో ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు యేడాది పాలనలో హామీలే తప్ప అమలు చేయడం లేదని ఆరోపించారు. సీఎం జిల్లాకు వచ్చినపుడు అభివృద్ధికి సంబంధించి ప్రకటనలు చేశారే తప్ప అవి ఆచరణకు నోచుకోలేదన్నారు.



వైఎస్సార్‌పాలనలో జిల్లాలో జరిగిన అభివృద్ధి మళ్లీ రావాలంటే శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి సీఎం కావడంతో సాధ్యపడుతుందన్నారు. వైఎస్సార్‌సీపీకి ఆకర్షితులై పెద్దఎత్తున పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాధరెడ్డి మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే అది దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి హయాంలోనని తెలిపారు. రాజంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ మిథున్‌రెడ్డి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు.



మున్సిపాలిటి ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయడం తధ్యమన్నారు. రాజంపేట పట్టణంలో ఆర్యవైశ్యులకు సంబంధించి శ్మశాన వాటికను హాస్టల్‌లో చోటుచేసుకున్న పరిణామాలను అడ్డంపెట్టుకొని తొలగిం చాలనుకుంటే సహించేది లేదన్నారు. వారికి వైఎస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందన్నారు. వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేత, పట్టణ బిల్డింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు పెనగల పాటి పెంచలయ్యనాయుడు మాట్లాడుతూ ప్రజలకు మేలుచేసే పార్టీ వైఎస్సార్‌సీపీ అని, వైఎస్ జగన్ పోరాట పటిమను చూసి పార్టీలో చేరుతున్నామని వివరించారు. 70మందికిపైగా వైఎస్‌ఆర్‌సీపీలో చేరడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చొప్పాయల్లారెడ్డి, యువనేత ఆకేపాటి మురళీరెడ్డి, పార్టీ నేతలు మద్దిపట్ల రామకృష్ణనాయుడు, బోనంమోహన్, పసుపులేటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top