నటనతో మెప్పిస్తా వర్ధమాన హీరోయిన్ సత్య

నటనతో మెప్పిస్తా వర్ధమాన హీరోయిన్ సత్య - Sakshi


కొవ్వూరు రూరల్: నటనతో మెప్పించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదిస్తానని గోదారి నవ్వింది సినిమా హీరోయిన్ సత్య అన్నారు. మండలంలోని కుమారదేవంలో శుక్రవారం షూటింగ్ విరామ సమయంలో ఆమె మాట్లాడుతూ విజయవాడలో పుట్టి పెరిగిన తనకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేదన్నారు. అక్కడే శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేశానని, భవిష్యత్‌లో సినిమాల్లో నటిస్తూ చదువు కొనసాగిస్తానని చెప్పారు. తన తల్లిదండ్రులు మంగళంపల్లి ప్రసాద్, లలితశ్రీ ప్రోత్సాహంతోనే ఈ రంగంలోకి వచ్చానన్నారు. 2015లో మిస్ విజయవాడగా ఎంపిక కావడం ఆనందాన్నిచ్చిందన్నారు. హీరో రామ్, హీరోయిన్ తమన్నా తనకు ఫేవరేట్లు అని చెప్పారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top