అంబేద్కర్ ఆశయాలను గౌరవిద్దాం


 సింగరాయకొండ, న్యూస్‌లైన్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబే ద్కర్  జయంతిని సోమవారం స్థానిక అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొండపి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి జూపూడి ప్రభాకరరావు హాజరయ్యారు. అంబేద్కర్  విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

 

ఈ సందర ్భంగా జూపూడి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు అల్లు వెంకటేశ్వర్లు, యరమాల సుబ్బారావు, అంబటి కొండలరావు, బిళ్లా కోటేశ్వరరావు, కటకం హరిబాబు, ఆరేటి లక్మీనారాయణ, చొప్పర నరసింహం, ఎల్ గిరిరాజు, సర్పంచ్ కె నాగమణి పాల్గొన్నారు.

 

 అంబేద్కర్‌కు అధికారుల నివాళి


ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : స్థానిక మిరియాలపాలెం సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక కలెక్టరేట్ వద్ద ఉన్న అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు వేశారు.



కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రమోద్‌కుమార్, అదనపు జాయింట్ కలెక్టర్ ఐ ప్రకాష్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ కే సరస్వతి, బీసీ సంక్షేమాధికారి కే మయూరి, గిరిజన సంక్షేమాఅధికారి ఎం కమల, డ్వామా పీడీ పోలప్ప, డీఈఓ రాజేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం రాజు, ఆర్‌డీఓ మురళి, ఐసీడీఎస్ పీడీ విద్యావతి, ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ విజయలక్ష్మి, ఏడీ సర్వేయర్ నర సింహారావు, ఇతర అధికారులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.



తదనంతరం స్థానిక అంబేద్కర్ భవన్‌లో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ సరస్వతి అధ్యక్షతన జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. అంబేద్కర్ ప్రపంచ మేధావి అని కొనియాడారు.   కార్యక్రమంలో దళిత సంఘాలనాయకులు యు బ్రహ్మయ్య, ఎన్ నాగేంద్రరావు, డీ శివాజి, సీహెచ్ వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.

 

అంబేద్కర్ ఆదర్శనీయుడు




ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అంబేద్కర్ ఆదర్శనీయుడని పశుసంవర్థకశాఖ జేడీ ఎన్ రజనీకుమారి పేర్కొన్నారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సంతపేటలోని బహుళార్థ పశువైద్యశాల ఆవరణలో నిర్వహించిన  కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.   అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జేడీ కోరారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డీ సురేంద్రప్రసాద్, చదలవాడ పశుక్షేత్రం ఏడీ పీ వెంకటసుబ్బయ్య  పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top