విజయనగరంలో ఇంటర్ విద్యార్థినిపై లైంగిక దాడి


గజపతినగరం: విజయనగరంలో ఐదుగురు యువకులు ఇంటర్ విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక పురిటిపెంట న్యూకాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని తన ఇంట్లో స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన యువకులు తమ కోర్కెను తీర్చకుంటే వీడియోను నెట్‌లో పెడతామని బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్టు విద్యార్థిని తల్లి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. శివాజీనాయక్, ప్రసన్నకుమార్, శ్రీకాంత్, భానుప్రసాద్, జితేంద్ర తన కుమార్తెను లైంగికంగా, మానసికంగా వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ యువకులు పట్టణంలోని ఒక మొబైల్ దుకాణంలో పనిచేస్తున్నారు. నిందితుల్ని బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ అహ్మద్ విచారిస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. బాధితురాలిని వైద్యచికిత్సల కోసం ఆస్పత్రికి తరలించారు.



 నిందితులపై నిర్భయ చట్టం



 ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. డీజీపీ జేవీ రాముడితో మాట్లాడారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. బాధితురాలిని ఆదుకోవాలని  అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top