‘నెట్టింట్లో’ చుట్టేస్తారు

‘నెట్టింట్లో’ చుట్టేస్తారు


* ప్రభుత్వ సాయంతో కట్టే ఇళ్లకు జియో టాగింగ్

* అక్రమాలను అరికట్టే దిశగా గృహ నిర్మాణ శాఖ అడుగులు


ఏలూరు (టూ టౌన్) : ఒకే స్థలంపై రెండు మూడు రుణాలు.. ఒకే వ్యక్తి పేరుతో అదే స్థాయిలో బిల్లుల మంజూరు.. ఒకే ఇంటిపై ఇద్దరు లేదా ముగ్గురికి వేర్వేరు పథకాల్లో ఇళ్ల కేటాయింపు.. గృహ నిర్మాణ శాఖలో ఇలాంటి అక్రమాలు అన్నీఇన్నీ కావు. ఇకపై వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఆ శాఖ సమాయత్తమైంది. ఇందుకు జియో టాగింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా మన జిల్లాలో పెలైట్ ప్రాజెక్టు కింద లక్ష ఇళ్లను జియో టాగింగ్ విధానం ద్వారా ఆన్‌లైన్ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంజూరు చేసిన ఇళ్లలో 98 వేల ఇళ్లకు సంబంధించిన వివరాలను సేకరించారు.

 

ఈ ఇళ్లన్నీ నెట్టింట్లోకే..

ప్రభుత్వం ఐఏవై, ఇందిరమ్మ, ఆర్‌పీహెచ్, అర్బన్ పథకాల కింద జిల్లాలోని పేదలకు సబ్సిడీతో కూడిన గృహ రుణాలను మంజూరు చేసింది. వీటిలో చాలా యూనిట్లు అక్రమార్కులు దక్కించుకున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురికి ఇళ్లు కేటాయించిన సందర్భాలు అనేకం ఉన్నారుు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ గృహ నిర్మాణ శాఖ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు తీసుకున్న లబ్ధిదారుల వివరాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడంతోపాటు ప్రతి ఇంటిని జియో టాగింగ్ పద్ధతిలో ఆన్‌లైన్ చేయూలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందారుు.

 

పని మొదలుపెట్టాం

గృహ నిర్మాణ శాఖ ద్వారా లబ్ధిపొందిన వారి ఆధార్ నంబర్లను అనుసంధానం చేయడంతోపాటు జియో టాగింగ్ విధానానికి శ్రీకారం చుట్టామని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లాలో మొత్తం 2 లక్షల 37వేల 770 ఇళ్లను నిర్మించగా, 2 లక్షల 34వేల 500 ఇళ్లకు సంబంధించి ఆధార్ సీడింగ్, ఆన్‌లైన్ ప్రక్రియల్ని పూర్తి చేశామని చెప్పారు. లబ్ధిదారుల ఇళ్లను హౌసింగ్ ఏఈలో ఫొటోలు తీసి సిద్ధంగా ఉంచారన్నారు. ఈ వివరాలన్నిటితో లక్ష ఇళ్లకు జియో టాగింగ్ చేయనున్నామని వివరించారు.



ఇది పూర్తి కాగానే మిగిలిన అన్ని ఇళ్ల వివరాలను, ఫొటోలను జియో టాగింగ్‌లో పొందుపరుస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో ఎవరెవరు సబ్సిడీతో కూడిన ఇంటి రుణాలు పొందారు, ఏ పేర్లతో తీసుకున్నారు, ఎక్కడ, ఎప్పుడు తీసుకున్నారనే వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని వివరించారు. తద్వారా అదే వ్యక్తులు భవిష్యత్‌లో ఎక్కడైనా అక్రమ పద్ధతుల్లో గృహ రుణాలు పొందేందుకు ప్రయత్నిస్తే అడ్డుకునేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.

 

జియో టాగింగ్ విధానమంటే..

ఒక లబ్ధిదారుడు సబ్సిడీతో కూడిన రుణం తీసుకుని ఇల్లు కడితే అతని ఫొటోతోపాటు అతని ఇంటి ఫొటోను కూడా తీసుకుంటారు. ఆధార్ నంబర్, రేషన్ కార్డు వివరాలను అనుసంధానం చేస్తారు. ఇల్లు కట్టిన ప్రదేశం, సర్వే నంబర్, గ్రామం, మండలం తదితర వివరాలను సవివరంగా నమోదు చేస్తారు. ఇల్లు, లబ్ధిదారుడి ఫొటోలను అందులో పొందుపరుస్త్తారు. ఇవన్నీ ఆన్‌లైన్‌లో భద్రపరు స్తారు. భవిష్యత్‌లో గృహ రుణం తీసుకునేందుకు ఎవరు దరఖాస్తు చేసిన తక్షణమే ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. సదరు వ్యక్తి గతంలో సబ్సిడీతో కూడిన రుణం తీసుకుని ఉంటే ఆ వివరాలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతారుు. అలాంటి వారికి రుణాలు మంజూరు చేయకుండా జాగ్రత్త వహిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top