ఏపీకి మా సాయం1.75 లక్షల కోట్లు

ఏపీకి  మా సాయం1.75 లక్షల కోట్లు - Sakshi

దక్షిణాదిలో బీజేపీ పాగాకు ఏపీ ప్రవేశద్వారం కావాలి: అమిత్‌ షా

- రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది 

విజయవాడలో బీజేపీ బూత్‌ కమిటీ కార్యకర్తల మహా సమ్మేళనం 

 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పునరుద్ఘా టించారు. రాష్ట్రానికి ఇప్పటికే  రూ.1.75 లక్షల కోట్ల ఆర్థిక సాయం అంద జేసినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తోందన్నారు. అలాగే రాష్ట్రానికి ఎన్నో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఇచ్చిందన్నా రు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై చాలామంది బీజేపీని వేలెత్తి చూపు తున్నారని, విభజన చట్టంలో హోదా అన్న అంశమే లేదన్నారు. అయినా హోదా వల్ల కలిగే ప్రయోజనాల కంటే ఒక్క రూపాయి కూడా తగ్గకుండా కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆర్థిక సహాయం చేస్తోందని వివరించా రు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్‌ షా గురు వారం విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ గ్రౌండ్‌లో బీజేపీ బూత్‌స్థాయి కమిటీ కార్యక ర్తల మహా సమ్మేళనంలో ప్రసంగించారు. 

 

ఈ సమ్మేళనం పార్టీ విజయానికి నాంది 

కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన మూడేళ్లలో 106 పథకాలను ప్రవేశపెట్టారని అమిత్‌ షా వివరించారు. ఏపీకి భారీ మొత్తం లో ఆర్థికం సాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. జూలైలో మోదీ ఈ గడ్డపై కాలు పెట్టగానే రాష్ట్రమంతటా పార్టీ శ్రేణులు సంబరాలు జరపాలన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ నేత మంత్రిత్వ శాఖకు జాతీయ స్థాయిలో రెండు అవార్డులు దక్కడం పార్టీ పనితీరుకు నిదర్శన మన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రవేశద్వా రంగా నిల వాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. లక్ష్యాన్ని సాధించేందుకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణు లకు పిలుపునిచ్చారు. విజయవాడ అంటే విజ యాన్ని అందించే ప్రాంతమని, ఇక్కడ జరుగు తున్న బూత్‌స్థాయి కమిటీ కార్యకర్తల సమ్మేళ నం రాష్ట్రంలో బీజేపీ విజయానికి నాంది కావా లన్నారు. విజయవాడ ప్రాంతంలోనే అర్జును డికి శివుడు పాశుçపతాస్త్రం అందించా డన్న నానుడి ఉందని, ఇప్పుడు జరుగుతున్న సమావేశం బీజేపీ గెలుపునకు పాశుపతాస్త్రం కావాలని చెప్పారు. 

 

ప్రతి బూత్‌ స్థాయిలో పార్టీ నిర్మాణం 

దేశవ్యాప్తంగా బీజేపీ బలోపేతమయ్యే ప్రక్రియ కొనసాగుతుందని అమిత్‌ షా అన్నారు. ఏపీలో 25 వేల బూత్‌స్థాయి కమిటీల నిర్మాణం ఇప్ప టికే పూర్తయిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతి బూత్‌ కమిటీలోనూ పార్టీ నిర్మాణం పూర్తి చేసే వరకూ తాను రాష్ట నేతల వెంటపడుతూ నే ఉంటానన్నారు. ఆగస్టులో మరో విడత రాష్ట్ర పర్యటనకు వస్తానని, అప్పటిలోగా రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ బూత్‌ల్లో పార్టీ నిర్మాణం పూర్తి కావాలని నేతలకు నిర్దేశించారు. ఆగస్టులో వీటన్నింటినీ క్షుణ్నంగా సమీక్షిస్తాన న్నారు. 

 

భవిష్యత్తు మనదే: వెంకయ్య నాయుడు 

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, ఈలోగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికీ బీజేపీని తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. ప్రధాని మోదీ తన పాలనతో ఇప్పటికే దేశంలోని ప్రతి ఇంటికీ, ప్రతి గుండెకూ చేరారని చెప్పారు. రాష్ట్రంలోనూ పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలు బీజేపీలో చేరేలా కృషి చేయాలని కోరారు. భవిష్యత్తు మనదేనని, బీజేపీని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. బీజేపీ సిద్ధాంతాలే దేశానికి శ్రీరామ రక్ష అని, పార్టీ విస్తరణకు తలెత్తుకొని పూనుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తల మహాసమ్మేళంలో రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ప్రసంగించారు. అమిత్‌ షా ప్రసంగాన్ని పురందేశ్వరి తెలుగులోకి అనువదించారు.  
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top