గాంధీజీ విగ్రహం తొలగింపు అమానుషం

గాంధీజీ విగ్రహం తొలగింపు అమానుషం - Sakshi


* వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ తెల్లం బాలరాజు

* కొయ్యలగూడెంలో గాంధీజీ విగ్రహానికి క్షీరాభిషేకం


కొయ్యలగూడెం : జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగించడం అమానుషమైన చర్య అని, టీడీపీ నాయకుల దాష్టీకానికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ కన్వీనర్ తెల్లం బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కొయ్యలగూడెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతిపితను యావత్ ప్రపంచం కూడా ఎంతో గౌరవిస్తుందని,  అటువంటిది పెదవేగి మండలం చోదిమళ్ల పంచాయతీ పరిధిలోని దొండపాడులో టీడీపీ నాయకులు జాతిపిత విగ్రహానికి ఘోర అవమానం తలపెట్టారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ చేస్తున్న అరాచకాలకు జరిగిన ఘోరం పరాకాష్టగా నిలిచిందని, ప్రజాస్వామ్యవాదులంతా పార్టీలకతీతంగా ఇటువంటి చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.



జరిగిన అవమానాన్ని శాసనసభ స్పీకర్, గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నామన్నారు. తొలగించిన చోటే మహాత్ముని విగ్రహాన్ని నిలబెట్టి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. అనంతరం బస్టాండ్ నుంచి గణేష్ సెంటర్ వరకు పాదయాత్ర చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెయిన్ సెంటర్‌లోని గాంధీ విగ్రహానికి బాలరాజు క్షీరాభిషేకం చేసి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. పట్టణ కన్వీనర్ మట్టా శ్రీనివాస్, జిల్లా సర్పంచ్‌ల ఛాంబర్ ఉపాధ్యక్షురాలు దేవీ గంజిమాల, జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్‌కుమార్‌లతో కలిసి ఎంపీటీసీ కొట్రా గంగారత్నం, జిల్లా ఎస్టీ సెల్ కన్వీనర్ కొవ్వాసి నారాయణరావు, డీసీసీబీ డెరైక్టర్ పొడియం శ్రీనివాస్, జిల్లా నాయకులు ఆరేటి సత్యనారాయణ, గంజిమాల రామారావు, చిన్నం గంగాధరం, కాసగాని గోఖలే, ఎస్‌కే బాజీ, దూలపల్లి కాంతారావు, సంకు కొండ, ఎస్‌కే నవాబ్, ఎస్‌కే వహాబ్ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top