విద్యతోనే భవిత


నెల్లూరు (సెంట్రల్):  చిన్నారులు చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని, ప్రతి బిడ్డనూ చదివిం చాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని 39, 51, 52 డివిజన్లలో గురువారం జరిగిన జన్మభూమి ముగింపు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. పింఛన్ల విషయంలో అర్హులకు అన్యాయం జరుగుతోందని, కదల్లేని వృద్ధులకు పింఛన్ తొలగిస్తే వారి జీవనం కష్టతరంగా మారుతుందన్నారు. అర్హులందరికీ పింఛన్ అందజేయాలన్నా రు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అర్హులందరికీ పింఛన్ అందజేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. పేదరికం నుంచే మహానుభావులు, గొప్పవాళ్లు తయారవుతారని అన్నారు. పేదింట్లో పుట్టిన మహామనిషి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యంగం రాశారన్నారు. అబ్దుల్‌కలాం గొప్ప శాస్త్రవేత్తగా గుర్తింపు పొందడంతో పాటు రాష్ట్రపతిగా దేశానికి సేవలందించారన్నారు. నరేంద్రమోదీ కుటుంబం గతంలో టీ స్టాల్ నడిపిందన్నారు.



టీ అంగట్లో తండ్రికి తోడుగా ఉన్న నరేంద్రమోదీ ప్రస్తుతం ప్రధాని అయ్యారన్నారు. పలు దేశాధినేతల ప్రశంసలు పొందుతున్న గొప్ప వ్యక్తి నరేంద్రమోదీ అని కొనియాడారు.  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ పింఛన్ల విషయంలో అర్హులకు అన్యాయం జరగకుండా జాగ్రత్తగా పరిశీలించి పంపిణీ చేయాలన్నారు. నియోజకవర్గంలోని ప్రతి సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానన్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లోని సమస్యలను తన దృష్టికి తెస్తే వెంటనే స్పందిస్తానని భరోసా ఇచ్చారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ పింఛన్ లబ్ధిదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదగా మెలగాలన్నారు. లబ్ధిదారులపై చిన్నచూపు తగదన్నారు. తన విజయంలో 52వ డివిజన్ ప్రజలు కీలకపాత్ర పోషించారని, మెజార్టీ ఓట్లు వేశారని గుర్తు చేశారు. ఈ డివిజన్‌లో తన సొంత నిధులతో వాటర్ ప్లాంట్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందిస్తానని చెప్పారు.



అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ పి.రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు లక్ష్మీసునంద, బొబ్బల శ్రీనివాసులు, ప్రశాంత్, ఎం. ప్రశాంత్‌కుమార్, ఓబిలి రవిచంద్ర, డి.రాజశేఖర్, ఊటుకూరు మాధవయ్య, గోగుల నాగరాజు, ఎండీ ఖలీల్ అహ్మద్, డి.అశోక్, పార్టీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, నాయకులు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, మందా బాబ్జీ, వి.మహేష్, కె.శ్రీనివాసులు, వి. రంగ, డి.వెంకటేశ్వర్లు, పి.ఫయాజ్‌ఖాన్, షాజహాన్, అమనుల్లి, సమి, షాన్‌వాజ్, అసిఫ్, ఉదయ్, వెంకటరమణ, ఇదయతుల్లా, జాషు, అరవ ఆనందబాబు, బాలాప్రసాద్, కె.సురేష్, సత్యానంద్, ఆంతోని బాబు, రమేష్, మురళీకృష్ణ, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, అల్లం నరేంద్ర, గంధం సుధీర్‌బాబు, ఇంతియాజ్  పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top