సుభిక్ష పాలన జగన్‌కే సాధ్యం


  • టీడీపీ ప్రలోభాలకు లోనుకావద్దు

  •  చంద్రబాబు ప్రజలను నట్టేట ముంచుతారు

  •  వైఎస్సార్‌సీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి సామాన్యకిరణ్

  •  చిత్తూరు (కొంగారెడ్డిపల్లె) న్యూస్‌లైన్: రాష్ట్రంలో సుభిక్షపాలన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డికే సాధ్యమని ఆ పార్టీ చిత్తూరు లోక్‌సభ  అభ్యర్థి సామాన్య కిరణ్ అన్నారు. సోమవారం చిత్తూరు రూరల్ మండలం ఎన్‌ఆర్ పేటలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి అన్ని వర్గాలకు మేలు జరిగేలా పాలన అందించారన్నారు.  



    ఎక్కడికెళ్లినా ప్రజలు వైఎస్సార్ అమలుచేసిన సంక్షేమ పథకాల మేలును చెబుతున్నారన్నారు. వైఎస్సార్ అందించిన  సుభిక్షపాలన మరోమారు రావాలంటే ప్రతి ఓటరూ నిలకడగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మహా నేత రాజశేఖరరెడ్డి పాలనను రాష్ట్ర ప్రజలకు అందించాలనే తలంపుతో జనం కోసం వైఎస్.జగన్ ఎత్తిన జెండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఆమె వివరించారు.



    ప్రతినిత్యం ప్రజల్లో ఉండి వారి కష్టాలను తెలుసుకున్న ఏకైక నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డేనని అన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకున్న జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి ఐదు సంక్షేమ పథకాల అమలు సంతకాలతో అన్నిరంగాల ప్రజలను ఆదుకుంటారన్నారు. ఎన్నికల్లో ఫ్యానుగుర్తుకు ఓటేసి వైఎస్సార్‌సీపీ అభర్థులను గెలిపించాలని ఆమె కోరారు. చంద్రబాబు ప్రజలను నట్టేట ముంచే రకమని, ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.

       

    అధికారంలో ఉన్నంతకాలం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తూ రైతుల నోట్లో మట్టి కొట్టే చర్యలకు పాల్పడ్డారన్నారు. చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీని  తెగనమ్మేందుకు కూడా వెనుకాడలేదన్నారు. అయితే అదే షుగర్ ఫ్యాక్టరీని  వైఎస్.రాజశేఖరరెడ్డి నిలబెట్టారన్నారు. ఆల్ ఫ్రీ ప్రకటనలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.



    టీడీపీ ప్రలోభాలకు లొంగిపోవద్దని ఆమె సూచించారు. వైఎస్సార్ సీపీ చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. చిత్తూరు పార్లమెం ట్‌కు తనను, పార్లమెంట్ పరిధిలోని అభ్యర్థులను గెలిపించాలని కోరారు.  



    ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు, చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు, ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పీవీ గాయత్రీదేవి, కేంద్ర పాలకమండలి సభ్యుడు ఆర్.గాంధీ, రూరల్ మండల జెడ్పీటీసీ అభ్యర్థి ఎంఎస్.బాబు, రూరల్‌మండల కన్వీనర్ రాజా, ఎన్‌ఆర్‌పేట సర్పంచ్ శోభ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top