నేడు ఐటీడీఏ సమావేశం`


- రెండేళ్ల తరువాత ఎట్టకేలకు ఖరారు

- తొలిసారిగా హాజరవుతున్న ఏజెన్సీ  ఎమ్మెల్యేలు,జెడ్పీటీసీలు,ఎంపీపీలు

- బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం కోసం,గిరిజన  సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం

పాడేరు:
సుమారు రెండేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పాలకవర్గ సమావేశం ఆదివారం  జరగబోతోంది. ఐటీడీఏ చైర్మన్‌గా ఉన్న జిల్లా కలెక్టర్ యువరాజ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి రావెల కిశోర్‌బాబు హాజరవుతున్నట్లు సమాచారం. నేడు పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించడానికి  పీవో హరినారాయణన్ పర్యవేక్షణలో ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.  



ఏజెన్సీలో వివిధ శాఖల ద్వా రా చేపడుతున్న అభివృద్ధి పనుల పరి ధిపై నివేదికలను సిద్ధం చేశారు. చివరిసారిగా 2013 మే 11న పాలకవర్గ స మావేశం జరిగింది. పాలకవర్గ సమావే శం ఎప్పుడు నిర్వహించ తలపెట్టినా పాలకపక్షానికి చెందిన మంత్రులు అం దుబాటులో లేకపోవడం వంటి కారణాలరీత్యా వాయిదాలు పడటం పరిపాటి గా మారింది. ఈ ఏడాది కూడా ఫిబ్రవ రి నెలలో పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రకటించి వాయిదా వేశారు. ఎట్టకేలకు ఆదివారం  సమావేశం ఖరారైంది. నిబంధనల ప్రకారం ఐటీడీఏ పాలకవర్గ సమావశం ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించ వలసి ఉంది. అయితే ఏనాడూ పాలకవర్గ సమావేశాలు నిర్ణీత సమయానికి జరిగిన పరిస్థితి లేదు.



ఐటీడీఏ ద్వారా చేపట్టే అభివృద్ధి పథకాలు, నిధుల వ్యయంతోపాటు ఏ కార్యక్రమమైనా ఐటీడీఏ పాలక మండలి సభ్యులుగా ఉన్న ఏజెన్సీ 11 మండలాలకు సంబంధించిన ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ సభ్యుల ఆమోదం తప్పనిసరిగా ఉండాలి.   ఈ సమావేశాలు సవ్యంగా, సకాలంలో జరగనందున అధికారులే కార్యక్రమాలను రూపొందించి అమలు చేయడం, ఆనక పాలక మండలి ఆమోదం కోసం సమావేశాలు మొక్కుబడిగా నిర్వహించడం పరిపాటి మారింది. అయితే రెండేళ్ల నుంచి పాలకవర్గ సమావేశాలు జరగకపోవడంతో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆలనా, పాలనా కొరవడింది. అలాగే ఏజెన్సీలోని స్థానిక సంస్థలకు కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు ఐటీడీఏ పాలక మండలి సభ్యులుగా తొలిసారి సమావేశానికి హాజరుకాబోతున్నారు. వీరిలో మెజారిటీ సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చెందినవారే.



విశాఖ మన్యంలో గత ఏడాది కాలంగా అభివృద్ధి పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. గ్రామాల్లో తాగునీరు, రవాణా తదితర సమస్యలు, మౌలిక సౌకర్యాల కల్పనలో జరుగుతున్న అలక్ష్యంపై ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తే అవకాశం ఉంది. దీనికి తోడు మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకిస్తూ ఐటీడీఏ పాలకవర్గం తీర్మానం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతా పట్టుబట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పాలకవర్గ సమావేశం ఈ సారి వాడి వేడిగా సాగనుంది.



- బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానించాలి

- ఎమ్మెల్యేలకు సీపీఎం ప్రతినిధుల విజ్ఞప్తి


ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తు తీర్మానం చేసి ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపాలని కోరుతూ పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావులకు శనివారం సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధంతోపాటు సీపీఎం ప్రతినిధులు పి.అప్పలనర్శ, ఉమా మహేశ్వరరావు, ఎంఎం శ్రీ ను, దేముడు, శంకరరావు తదితరులు కలిసి విజ్ఞప్తి చేశారు. బాక్సైట్ తవ్వకాలను చేపట్టకూడదని, ఏజెన్సీవ్యాప్తంగా గిరిజనులు ఎన్నో ఏళ్లుగా పోరాటం సాగిస్తున్నారని, ప్రజాభీష్టం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పా ర్టీ ప్రతినిధులంతా చొరవ తీసుకొని ఐటీడీఏ తీర్మానం కోసం పట్టుపట్టాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top