ఇక ఇంటర్‌లోనూ ఉచిత పాఠ్యపుస్తకాలు

ఇక ఇంటర్‌లోనూ ఉచిత పాఠ్యపుస్తకాలు - Sakshi


ప్రభుత్వ ఎయిడెడ్ విద్యార్థులకు వరం

ఇతర విద్యార్ధులకూ చౌకధరలకే పుస్తకాలు


 

హైదరాబాద్: ఆంధ్రపదేశ్ ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాల విద్యార్థులకు శుభవార్త. ఈ విద్యాసంవత్సరం నుంచీ పాఠ్యపుస్తకాల్ని ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరితోపాటు మిగిలిన ప్రైవేటు కాలేజీల్లోని విద్యార్థులకు కూడా తక్కువ ధరలకే  విక్రయించేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లోని దాదాపు మూడు లక్షలమందికిపైగా విద్యార్థులకు ఇవి అందనున్నాయి.



గతంలో ప్రైవేటుగా విక్రయించే ఈ పుస్తకాల రేట్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి దాదాపు సగం ధరకే విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయా పుస్తకాల ధరల్ని ముందుగానే నిర్దేశించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయానికీ రాలేదు. ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు విక్రయించే పుస్తకాల ధరలిలా ఉన్నాయి.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top