ఇళ్ల స్థలాల పేరిట మోసం

ఇళ్ల స్థలాల పేరిట మోసం - Sakshi


►  ఇద్దరు నిందితుల అరెస్టు

► వీవీఆర్‌ హౌసింగ్‌ ఎండీ కోసం గాలింపు




సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుమల గ్రీన్‌ గార్డెన్సు పేరిట ఇళ్ల స్థలాల వెంచర్లు వేశామని నమ్మబలికి వివిధ ప్రాం తాలకు చెందిన పలువురు కొనుగోలు దారుల నుంచి డబ్బులు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు బడా మోసగాళ్లను తిరుపతి క్రైం పోలీసులు అరెస్టు చేశారు. క్రైం డీఎస్పీ కొండారెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. కృష్ణా జిల్లా పెడన మండలం బల్లిపర్రుకు చెందిన వాకా వాసుదేవరావు తిరుపతిలో వీవీఆర్‌ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమి టెడ్‌ పేరిట కార్యాలయాన్ని ప్రారంభించాడన్నారు. వ్యాపార వ్యవహారా లు చూసుకునేందుకు శ్రీకాళహస్తి, తిరుచానూరు ప్రాంతాలకు చెందిన కె.రసరాయనాయుడు, కె.వెంకట రవిచంద్రను నియమించుకున్నాడని తెలిపారు.


శ్రీకాళహస్తి, తొట్టంబేడు, తిరుపతి పరిసరాల్లో రియల్‌ వ్యాపా రం చేస్తున్నామని, సులభ వాయిదాల్లో నగదు చెల్లింపులు జరిపితే ఖాళీ ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేస్తామని ప్రచారం చేశారు. దీంతో తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి ప్రాంతాలకు చెందిన అనేక మంది ఇంటి స్థలాల కోసం స్కీముల్లో చేరి నెలవారి చెల్లింపులు జరిపారు. పది నుంచి 12 నెలలు గడిచాక అనుమానం వచ్చిన ఒకరిద్దరు కొనుగోలు దారులు ప్లాట్లు ఎక్కడో చూపాలని నిలదీయడంతో బోర్డు తిప్పేసి ముగ్గు రూ పరారయ్యారు. అప్పటికే మూడు ప్లాట్ల కోసం రూ.1.80 లక్షలకు పైగా చెల్లించిన రేణిగుంటకు చెందిన ఎన్‌.గీత గత నెలలో అర్బన్‌ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.


దీంతో పోలీసులు ముగ్గురిపై 420 కేసు నమోదు చేసి గాలింపు ప్రారంభించారు. శనివారం ఎయిర్‌బైపాస్‌ రోడ్డులో రసరాయనాయుడు, రవి చంద్ర ఉన్నట్లు తెల్సుకుని వెళ్లి అరెస్టు చేశారు. వీవీఆర్‌ హౌసింగ్‌ ఎండీ వాసుదేవరావు కోసం గాలింపు విస్తృతం చేశామని డీఎస్పీ కొండారెడ్డి పేర్కొన్నారు. వాసుదేవరావుపై ఇంతకు ముందే పంజాగట్టు, అనంతపురం జిల్లా కస్సాపురం పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయనీ తెలి పారు. అతను కొనాళ్లు రిమాండ్‌లో ఉన్నట్లు వివరించారు. కేసును త్వ రితగతిన కొలిక్కి తెచ్చిన సీఐ సత్యనారాయణను డీఎస్పీ అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top