ఆళ్లగడ్డలో 4 నామినేషన్లు తిరస్కరణ
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో 4 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులు చాకలి పుల్లయ్య, విజయలక్ష్మి, బోయ చంటి, నాగమౌనిక రెడ్డి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
ఆళ్లగడ్డలో మొత్తం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ నామినేషన్ దాఖలు చేయగా.. ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఎంఐఎం పార్టీలు తమ అభ్యర్థులను పోటీ పెట్టలేదు.