మార్కెట్లో అగ్నిప్రమాదం
విజయనగరం : విజయనగరం పట్టణంలోని బాలాజీ మార్కెట్లో ఉన్న రెండు వస్త్ర దుకాణాల్లో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. 31, 32 నంబర్ రెడీమేడ్ వస్త్ర దుకాణాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు లేవడంతో లోపలున్న వస్త్రాలన్నీ కాలి బూడిదగా మారాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా.