హోరెత్తుతున్న ప్రత్యేక పోరు

హోరెత్తుతున్న ప్రత్యేక పోరు - Sakshi


ప్యాకేజి రాజకీయాలపై నిరసన

జగన్ దీక్షకు వెల్లువెత్తుతున్న మద్దతు

కొనసాగుతున్న రిలే దీక్షలు

పార్టీలకతీతంగా సంఘీభావం


 

విశాఖపట్నం: ప్రత్యేక హోదా నినాదం హోరెత్తిపోతుంది. ఇందుకోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరశన దీక్షకు ప్రజా మద్దతు వెల్లువెత్తు తుంది. ఊరూ..వాడా ఒక్కటై నినదిస్తుంది. మూడురోజులుగా అన్ని దారులు గుంటూరు వైపే దారితీస్తున్నాయి. జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులతో పాటు భారీసంఖ్యలో నల్లపాడుకు తరలి వెళ్తున్నారు. మరో పక్క  జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.



జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట తూర్పు నియోజక వర్గ పార్టీ శ్రేణులు రిలే దీక్షలు చేపట్టగా, కో ఆర్డినేటర్ వంశీకృష్ణ యాదవ్‌తో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్,రాష్ర్ట ప్రదానకార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్లబాబూరావు, రాష్ర్ట కార్యదర్శి కంపాహనోక్, స్టూడెంట్ విభాగం రాష్ర్ట కార్యదర్శి బి.కాంతారావు, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోను శివరామకృష్ణ, తదితరులుపాల్గొన్నారు.

 జ్ఞానా పురం జోన్-4 కార్యాలయం ఎదుట  పశ్చిమ నియోజకవర్గ పార్టీ శ్రేణులు నిర్వ హించిన నిరసనలో కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ పాల్గొ న్నారు.



కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో దక్షిణ నియో జక వర్గ కోఆర్డినేటర్ కోలా గురువులు, రాష్ర్ట కార్యదర్శి జాన్‌వెస్లీ,మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు ఎండి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.సీతమ్మధార తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలో ఉత్తర కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ తదితరులు..గాజువాకలో  మాజీ ఎమ్మెల్యే, రాష్ర్ట కార్యదర్శి తిప్పల గురుమూర్తిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి..పెందుర్తిలో పార్టీ కోఆర్డినేటర్ అన్నంరెడ్డి అదీప్ రాజు భీమిలిలో మాజీ ఎమ్మెల్యే కర్రిసీతారాం దీక్షల్లో పాల్గొన్నారు.



పాయకరావుపేట తహశీల్దార్ కార్యాలయం నిరసన చేపట్టగా, నక్కపల్లిలలో రిలే దీక్షలు కొనసాగాయి. ఈ రెండుచోట్ల మాజీ ఎమ్మెల్యే చెంగలవెంకట్రావు, కోట ఉరట్ల వద్ద మాజీ ఎమ్మెల్సీ డిఎస్‌ఎన్ రాజు ..యలమంచిలిలో  కో ఆర్డినేటర్ ప్రగడ నాగేశ్వరరావు.. నర్సీపట్నంలో పార్టీ కో ఆర్డినేటర్ పెట్ల ఉమాశంకర గణేష్..చోడవరంలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, రాష్ర్ట అధికార ప్రతినిధి కొయ్యా ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. పాడేరు, జి. మాడుగులలో రెండోరోజు కొనసాగిన రిలే దీక్షల్లో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాల్గొన్నారు. మాడుగుల నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో రెండోరోజు కొనసాగిన దీక్షల్లో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top