నేటినుంచి మళ్లీ జన్మభూమి


విజయవాడ : జిల్లాలో శనివారం నుంచి నిర్వహించనున్న జన్మభూమి-మా ఊరు కార్యక్రమం విజయవంతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. జన్మభూమి కార్యక్రమంపై శుక్రవారం హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కి స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి పాల్గొన్నారు.



అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ జన్మభూమినిర్వహణపై సీఎం పలు సూచనలు చేశామని చెప్పారు. రేషన్, ఆధార్ కార్డులో వయస్సు తక్కువగా నమోదై పింఛన్లకు అర్హత కోల్పోయిన వారి వివరాలను సేకరించి గ్రామ, మండల, జిల్లా కమిటీల ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు, సబ్-కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, పశుసంవర్ధకశాఖ జేడీ దామోదరనాయుడు పాల్గొన్నారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top