వరద నీటితో రైతులకు ఉపయోగం

వరద నీటితో రైతులకు ఉపయోగం - Sakshi


 సింహాద్రిపురం :

 తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి వృథాగా పోతున్న వరద నీటిని కాలులను ఆధునికీక రించి సాగునీటికి మళ్లిస్తే రైతులకు ఎంతో ఉపయోగకరమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సిం హాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులో లింగాల మండలం కర్ణపాపాయపల్లెకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు అంకాల్‌రెడ్డి ఆదివారం ఏర్పాటు చేసిన విందుకు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డితో కలసి ఆయన హాజరయ్యారు. కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయన్నారు. కాలువలను వెడల్పు చేసి, ఆ నీటిని పంట పొలాలకు మళ్లిస్తే బంగారు పంటలను పండింవచ్చన్నారు. లింగాల, వేముల, సింహాద్రిపురం మండలాల్లో ఎండిన పంటలను పరిశీలించేందుకు తమ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి పర్యటించాల్సి ఉండగా.. చివరి దశలో పర్యటన రద్దయిందన్నారు. త్వరలో ఎండిన పంటలను పరిశీలించి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. అనంతరం లింగాల ఏపీజీ బ్యాంకు మేనేజర్ నిరంజన్‌రెడ్డితో పంటల రెన్యువల్ గురించి మాట్లాడారు. లింగాల సింగిల్ విండో అధ్యక్షుడు మల్లికేశ్వరరెడ్డి, డెరైక్టర్ రాజేశ్వరి, పార్టీ నాయకులు నాగశేషులరెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ బాబు పాల్గొన్నారు.



 






 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top