10 రోజుల పనికి 103.50 కోట్లా?!


రెయిన్‌ గన్లపై రైతు సంఘాల నేతల విస్మయం

రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘సాక్షి’ కథనం




సాక్షి, అమరావతి: గత ఖరీఫ్‌ సీజన్‌లో కేవలం 10 రోజులు వినియోగించిన రెయిన్‌ గన్ల నిర్వహణకు రూ.103.50 కోట్లు ఖర్చు చేశారా? రెయిన్‌ గన్లకు నిర్వహణ నిజంగా అంత ఖర్చవుతుందా? అని రైతు సంఘాల నేతలు, ప్రతినిధులు నివ్వెరపోతున్నారు. ఒక్క ఎకరం పంటనైనా కాపాడలేకపోయిన ఈ చినుకు తుపాకుల పేరిట ఖర్చు చేసిన సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందోనని చర్చించుకుంటున్నారు. ‘చినుకు తుపాకుల చిల్లర ఖర్చు రూ.103.50 కోట్లు’ పేరిట ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


( ‘చినుకు’ తుపాకుల చిల్లర ఖర్చు 103 కోట్లు )


ఇంత అన్యాయమా? ప్రజాధ నాన్ని మింగేస్తారా? అంటూ రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెయిన్‌ గన్ల కొనుగోలుకు రూ.163 కోట్లు కాగా, నిర్వహణ, ఇతరత్రా అవసరాలకు రూ. 103.50 కోట్లు వెచ్చించడం ఏమిటని మండిపడ్డారు. ఈ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. రెయిన్‌గన్ల కొనుగోలు, నిర్వహణపై శ్వేత పత్రం విడుదల చేసి, రైతుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం కార్యదర్శి కేవీవీ ప్రసాద్, ఏపీ రైతు సంఘం నేత రామారావు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top