బంగారు రుణాలు వేలాలను ఆపివేయాలి


సలకంచెర్వు(శింగనమల): ఎన్నికల్లో టీడీపీ పార్టీ బంగారు రుణాలు మాఫీ చేస్తామని తెలుపడంతో, రైతులు ఆ రుణాలు చెల్లించలేదని, ప్రస్తుతం పంటలు పండక పోవడంతో రుణాలు చెల్లించలేక పోతున్నారని, వాటిని రెన్యూవల్ చేసుకోకుండా వేలం వేస్తున్నారని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని సలకంచెరువు స్టేట్ బ్యాంక్‌లో గురువారం మధ్యాహ్నం బంగారు వేలం వేయడాన్ని సీపీఐ నాయకులు అడ్డుకున్నారు. బ్యాంక్ ఎదుట మూడు గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి చెన్నప్ప మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకే రైతులు అప్పట్లో రుణాలు చెల్లించలేదని, ప్రస్తుతం వారి వద్ద రుణాలు చెల్లించే స్థోమత లేదన్నారు.

 

బ్యాంక్ అధికారులు బంగారు వేలం వేయకుండా, రుణాలును రెన్యూవల్ చేసుకోవాలని ప్రాధేయపడుతున్న రెన్యూవల్ చేసుకోలేదన్నారు. ఆదేవిదంగా అర్హులైన రైతులందరికీ కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌సీ,ఎస్‌టీ, బీసీలకు రుణాలు మంజూరు చేయాలని, మహిళ సంఘాలకు రూ. 5లక్షల వరుకు రుణాలు మంజూరు చేయాలన్నారు. పాడి పశువులకు, గొర్రెలు, మేకలుకు నాబార్డు రుణాలు మంజూరు చేయాలన్నారు. అనంతరం బ్యాంక్ మేనేజరు ప్రకాష్‌రావు ఆర్‌ఎం దృష్టికీ సమస్యను తీసుకెళ్లడంతో బంగారు రుణాల వేలంను అపి వేశారు. పంటల రుణాలతో సంబంధం లేకుండా బంగారు రుణాలురెన్యూవల్ చేసుకున్న, రుణాలుచెల్లించిన బంగారు ఇస్తామని తెలుపడంతో ధర్నాను విరమించారు. ఈధర్నా కార్యక్రమంలో సీపీఐ నాయకులు పోతన్న, సూరి, వెంకటరెడ్డి, రామాంజినేయులు పాల్గొన్నారు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top