నేడు ఉరవకొండలో రైతు సదస్సు

నేడు ఉరవకొండలో రైతు సదస్సు - Sakshi


- హంద్రీ-నీవా ఆయకట్టుకునీటి సాధనే లక్ష్యం

- జిల్లా నలుమూలల నుంచి తరలిరానున్న రైతులు

- హాజరుకానున్న అఖిలపక్ష నేతలు

ఉరవకొండ/ ఉరవకొండ రూరల్ :
హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) మొదటి దశ కింద జిల్లాలో 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్న డిమాండ్‌తో సోమవారం ఉరవకొండలోని వీరశైవ కల్యాణ వుండపంలో రైతు సదస్సు నిర్వహిస్తున్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలతో కలిసి నిర్వహిస్తున్న ఈ సదస్సుకు హంద్రీ-నీవా ఆయకట్టు సాధన సమితి అన్ని ఏర్పాట్లు చేసింది.  ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘవీరారెడ్డి, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రావుకృష్ణ, వుధు, జిల్లా కార్యదర్శులు హాజరుకానున్నారు. ఉదయుం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుంది.



జిల్లా నలువుూలల నుంచి రైతులు భారీగా తరలిరావాలని ఆయకట్టు సాధన సమితి సభ్యులు అశోక్, తేజోనాథ్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. హంద్రీ-నీవా పథకం పనులను 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. మొదటివిడత కింద జీడిపల్లి రిజర్వాయర్ వరకూ ప్రధాన కాలువ పూర్తి చేశారు. దీని ద్వారా గతేడాది 16.9 టీఎంసీల కృష్ణా జలాలు వచ్చాయి. ఈ నీటితో కనీసం 1.50 లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చు. మొదటి విడత కింద 1.18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గతేడాది వచ్చిన నీటితో ఈ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటిని ఇవ్వడంతో పాటు చెరువులనూ నింపొచ్చు. ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీల (ఉప, పిల్లకాలువలు) నిర్మాణం చేపట్టకపోవడంతో ఆయకట్టుకు నీరందించే వీల్లేకుండా పోయింది. రూ.వంద కోట్లు ఖర్చు చేస్తే మొదటివిడతలో డిస్ట్రిబ్యూటరీలు పూర్తవుతాయి. అయితే.. సీఎం చంద్రబాబు  కుప్పంకు నీళ్లు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటరీల పనులు ఆలస్యం చేయాలని జీవో నెంబర్ 22 జారీ చేశారు.

 

ప్రభుత్వం కళ్లు తెరిపిస్తాం : ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి


ఉరవకొండలో సోమవారం జరిగే రైతు సదస్సు ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం ఆయన ఉరవకొండ మండలం చిన్నవుూస్టురులో విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హంద్రీ-నీవా మొదటి దశ ఆయకట్టుకు నీరివ్వకుండా ఆ నీటిని సొంత నియోజకవర్గానికి తరలించడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారన్నారు. హంద్రీ-నీవాను పూర్తిగా తాగునీటి ప్రాజెక్టుగా వూర్చేలా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కుట్రను అఖిల పక్షాలతో కలిసి తిప్పికొడతామన్నారు. రైతు సదస్సులో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. కార్యక్రవుంలో వైఎస్సార్‌సీపీ వుండల కన్వీనర్ సుంకన్న, జిల్లా కమిటీ సభ్యులు తేజోనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top