నకిలీ మావోయిస్టు అరెస్ట్

నకిలీ మావోయిస్టు అరెస్ట్


 మక్కువ: మావోయిస్టుల పేరు వాడుకుని డబ్బు సంపాదించాలని చూసిన ఓ యువకుడు కటకటాలపాలయ్యా డు. మావోయిస్టుగా చలామణీ అవుతూ జనాలను బెదిరిస్తున్న మండలంలోని నగుళ్లు గ్రామానికి చెందిన దండు రవి అనే యువకుడిని శుక్రవారం రాత్రి స్థానిక ఎస్సై బి.రవీంద్రరాజు, సీఆర్‌పీఎఫ్, పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం మీడి యా మందు రవిని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్ ఐ రవీంద్రరాజు మాట్లాడారు.

 

 ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నగుళ్లు గ్రామానికి  చెందిన రవి అనే యువకుడు కొరాపుట్ దళ సభ్యుడిగా చెప్పుకుంటూ అదే గ్రా మంలో పొలాలను సాగు చేస్తున్న అమలాపురం పట్ట ణం, బొబ్బిలిలో నివాసముంటున్న నల్లా గోపినాథ్‌ను రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో గోపీనాథ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు రవిని పట్టుకునేందుకు పథక రచన చేశారు. పథకం ప్రకారం గోపీనాథ్ డబ్బులు ఇస్తానని రవికి చెప్పడంతో నగుళ్లు, కె.పెద్దవలస గ్రామాల మధ్యన ఉన్న ఓ ప్రదేశానికి రవి ఎయిర్ పిస్టల్ పట్టుకుని వ చ్చాడు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఎస్‌ఐ రవీంద్రరాజు, పోలీస్ సిబ్బంది రవిని అరె స్టు చేశారు. అనంతరం రవి ఇంటి వద్దకు వెళ్లి పరిశీలించగా సింగల్ బే రర్ మేజర్‌లోడెడ్ లాంటి నాటు తుపాకీ, కత్తి దొరికాయి.

 

 గతంలోనూ...

 2012లో రవి మావోయిస్టునని చెప్పి సాలూరు మండ లం మామిడి గ్రామానికి చెందిన అక్కేన తిరుపతిరావును రూ.50వేలు ఇవ్వాలని బెదిరించాడు. అప్పట్లో సా లూరు పోలీసులు రవిని అరెస్ట్ చే శారు. బెయిలుపై విడుదలైనా యువకుడిలో ఎలాంటి మార్పు రాలేదు. అదే ఏడాది విశాఖపట్టణం త్రీటూన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఏటీఎంలో దొంగతనం చేస్తూ పట్టుబడడంతో అప్పట్లో త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

 

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top