నిరసనల సెగ

నిరసనల సెగ - Sakshi


రుణమాఫీపై చంద్రబాబు

తీరుపై నిప్పులు చెరిగిన అన్నదాతలు

భీమవరంలో నమూనా

ప్రజాకోర్టు..  గడ్డిబొమ్మకు ఉరి

పలుచోట్ల దిష్టిబొమ్మల దహనం

 ఏలూరు : రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను వెంటనే మాఫీ చేయాలంటూ చేపట్టిన ఆందోళనలు జిల్లాలో మూడో రోజైన శనివారం కూడా పెద్దఎత్తున కొనసాగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు, మహిళలు కదం తొక్కారు. రుణమాఫీ విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న తీరును నిరసించారు. భీమవరం ప్రకా శం చౌక్‌లో నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నమూనా ప్రజాకోర్టు నిర్వహిం చారు. న్యాయమూర్తిగా కామన నాగేశ్వరరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రాయప్రోలు శ్రీనివాసమూర్తి వ్యవహరించగా, రైతుగా విజ్జురోతి రాఘవులు, డ్వాక్రా సభ్యురాలిగా పాలవెల్లి మంగ, చంద్రబాబు నాయుడిగా సునిల్‌కుమార్ వ్యవహరించగా.. వినూత్నంగా నమూ నా వాదనలు జరిగాయి.



చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నారని బాధితులుగా వ్యవహరించిన వారు ఆవేదన చెందారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన నమూనా ప్రజాకోర్టు న్యాయమూర్తి చంద్రబాబు నాయుడి దిష్టిబొమ్మను ఉరి తీయూలని పేర్కొన్నారు. దీంతో దిష్టిబొమ్మను ఈడ్చుకెళ్లి.. చెట్టుకు వేలాడదీసి.. అనంతరం దహనం చేశారు. దీంతోపాటు నారావారి నరకాసురుడి’ బొమ్మను దహనం చేశారు. కొయ్యలగూడెంలో ‘నరకాసుర వధ’ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. మండల వైఎస్సార్ సీపీ యూత్ కన్వీనర్ తోట జయబాబు ఆధ్వర్యంలో రైతులు, మహిళలు రోడ్డుపై బైఠాయించారు.



చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మను తగులబెట్టారు. రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాల న్నిటినీ రద్దు చేయూలని కోరుతూ కామవరపుకోట తహసిల్దార్‌కు పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పిం చారు. కొవ్వూరులో పార్టీ నాయకుడు పరిమి హరిచరణ్ ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను ఊరేగించి నిరసన తెలిపారు. మహిళలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్‌లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. పార్టీ నాయకులు పోల్నాటి బాబ్జి, బీవీఆర్ చౌదరి, చనమాల శ్రీనివాస్ పాల్గొన్నారు.



దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో రైతులు, నాయకులు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. మొగల్తూరు మండలం కేపీ పాలెం, పేరుపాలెం గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేపట్టారు. జీలుగుమిల్లి జగదాంబ సెంటర్‌లో నరకాసురవధ కార్యక్రమం నిర్వహించారు. తొలుత భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి, చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా మాజీ కన్వీనర్ తెల్లం బాల రాజు మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయూలని డిమాండ్ చేశారు. లేదంటే వారి తరఫున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top