ఏయూ నియామకాలు సరికాదు

ఏయూ నియామకాలు సరికాదు - Sakshi

  • మంత్రి గంటా శ్రీనివాసరావు

  • విశాఖపట్నం: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో కొద్దిరోజుల క్రితం జరిగిన మూడు నియామకాలు సరికాదని మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశా రు. బుధవారం  సర్య్కూట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో విలేకరుల అడిగిన ప్రశ్నకుమంత్రి సమాధానమిచ్చారు. ప్రాధమిక విచారణలో ఇది అక్రమమని తేలిందన్నారు.



    కొద్ది వారాల క్రితం వర్సిటీలో వివిధ పథకాలలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు అబ్జార్బ్ పేరుతో వర్సిటీలోని సోషల్ వర్క్, సోషియాలజీ, అకడమిక్ స్టాఫ్ కళాశాలలో నియమిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌తో కమిటీ నియమించి విచారణ జరిపించాలని ఆదేశించారు.  కమిటి ప్రాధమిక విచారణలో  నియామకాలు తప్పుపట్టిం దన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ ఎన్.ఏ.డి పాల్‌ను అకడమిక్ స్టాఫ్ కళాశాలలో, డాక్ట ర్ హరనాథ్‌ను సోషల్ వర్క్ విభాగంలో, సార్క్ అధ్యయన కేంద్రంలో పని చేస్తున్న డాక్టర్ శ్రీమన్నారాయణను సోషియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించేశారు. వీటి ని అబ్జార్బ్ చేసుకుంటున్నట్లుగా ఉత్తర్వులలో పేర్కొన్నారు.



    భవిష్యత్తులో జరిపే ఉద్యోగాల భర్తీలో వీటిని ఖాళీలుగా చూ పే అవకాశం ఉండదంటూ వర్సిటీలో దుమా రం రేగింది. ఎటువంటి నోటిఫికేషన్, ఇంట ర్వ్యూలు లేకుండా నియామకాలు జరపడంపై నిరుద్యోగులు సైతం తీవ్ర ఆవేదన చెందారు. ఇదే విషయమై ప్రభుత్వానికి ఫిర్యాదులు సైతం వెళ్లాయి. ప్రాధమిక విచారణతో తప్పు తేలడంతో వర్సిటీ అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా అనే విషయం త్వరలో తేలే అవకాశం ఉంది.

     

    విద్యార్థులతో ఆటలొద్దు: గంటా

     

    సాక్షి, విశాఖపట్నం : స్థానికత అంశంలో విద్యార్థుల భవిష్యత్తుతో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన ప్రభుత్వ అతిథి గృహంలోవిలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  కేసీఆర్‌కు ఇది సరికాదని మంత్రి హితవుపలికారు. సినీ పరిశ్రమ విశాఖ వచ్చేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  ఏ ఒకరిద్దరి అభిప్రాయమో కాకుండా సినీ రంగంలోని అన్ని విభాగాల ప్రతినిధుల సలహా, సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు.



    సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ వెల్లడించనున్నట్టు తెలపారు. బీఈడీ, డీఎడ్ చదువుతోన్న తాజా అభ్యర్థులకు అవకాశం కల్పించడంపై న్యాయపరమైన అంశాల్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్ని రంగాల్లో సిబ్బంది కొరత వేధిస్తోందని, విద్యాశాఖలోనే 62 శాతం సిబ్బంది లోటున్నట్టు లెక్కలు చెప్తున్నాయన్నారు. విశాఖ ఏజెన్సీలో గిరిజనుల కోసమే బాక్సైట్ తవ్వకాలపై ముఖ్యమంత్రి మాట్లాడారని, వారికి నష్టం కలగని రీతిలోనే తవ్వకాలు చేపడతారన్నారు. గిరిజనులు వ్యతిరేకిస్తే బాక్సైట్ తవ్వకాల్ని నిలిపేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top