విస్తరిస్తున్న సైబర్ నేరాలు


తణుకు: ‘హలో.. మేం ఫలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. మీరు ఫలానా నాగేశ్వరరావుగారే కదా.. మీ ఖాతా నంబర్, ఏటీఎం కార్డు పిన్ నంబర్ చెప్పండి.. ఇక్కడ ఒకసారి సరిచూసుకోవాలి.. త్వరగా చెప్పండి.. సర్వర్‌తో ఇబ్బందులు ఉన్నాయి.. లేకపోతే మా బ్యాంకులో మీ ఖాతా తొలగిస్తాం..’ అంటూ ఫోన్లు రావడంతో వివరాలు చెప్పిన పలువురు మోసపోరుు బ్యాంకు ఖాతాల్లోని సొమ్ములు పొగొట్టుకుంటున్నారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సైబర్ నేరగాళ్లు ఇలాంటి ఫేక్ కాల్స్‌తో నిమిషాల వ్యవధిలోనే బ్యాంకు ఖాతాల్లోని నగదును కాజేస్తున్నారు.

 

 జిల్లాపై కేటుగాళ్ల దృష్టి

 ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలే లక్ష్యంగా ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్ల కన్ను ఇప్పుడు జిల్లాలోని ప్రధాన పట్టణాలపై పడింది. ఇటీవల తణుకుకు చెందిన ఓ రెడిమేడ్ షోరూం అధినేత ఒకరికి ఇదే తరహాలో ఫోన్ వచ్చింది. ముంబై నుంచి ఫోన్ చేసిన నేరగాళ్లకు వివరాలు చెప్పడంతో నిమిషాల వ్యవధిలోనే అతని ఖాతా నుంచి రూ.30 వేలు కాజేశారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, నరసాపురం వంటి పట్టణాల్లో చోటుచేసుకున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే చోరీల భయంతో హడలెత్తుతున్న ప్రజలకు సైబర్ నేరాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారుు.

 

 డబ్బు కాజేస్తున్నారిలా..

 సైబర్ నేరగాళ్లు బ్యాంకు నుంచి లేదా ఆర్‌బీఐ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి మాటల్లో దించుతారు. మీ పేరు, బ్యాంకు ఖాతా, ఏటీఎం నంబర్లు చెబితే బ్యాంకులో ఖాతాలను సరిచూస్తామని చెప్పి నమ్మబలుకుతారు. వివరాలు చెబితే బ్యాంకు ఖాతా పాస్‌వర్డ్‌ను హ్యాక్ చేసి డబ్బులు కాజేస్తారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల తరచుగా జరుగుతున్నారుు. తణుకు పట్టణానికి చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి సైతం సైబర్ నేరగాళ్ల మాయలో పడి తన ఖాతాలోని రూ.45 వేలను పోగొట్టుకున్నారు. పరువుకు భంగం కలుగుతుందన్న ఉద్దేశంతో కనీసం పోలీసులకు సైతం ఫిర్యాదు చేయకుండా ఆయన మౌనంగా ఉండిపోయూరు.

 

 ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండండి

 సైబర్ నేరగాళ్లు చేస్తున్న తప్పుడు ఫోన్‌కాల్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు ఖాతా నంబర్లు, ఏటీఎం కార్డు వివరాలు తెలియజేయాలని ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. సైబర్ నేరాలైపై గట్టి నిఘా పెట్టాం. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్ష తప్పదు.

 -ఆర్.అంకబాబు, తణుకు సీఐ

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top