ఎస్వీయూలో అంతరిక్ష పరిశోధనలు

ఎస్వీయూలో అంతరిక్ష పరిశోధనలు

  •      అత్యాధునిక మీటియోర్ రాడార్ కేంద్రం ఏర్పాటు

  •      ఇలాంటి కేంద్రం ఏర్పాటైన తొలి విశ్వవిద్యాలయం ఎస్వీయూనే

  • యూనివర్సిటీ క్యాంపస్ :  అంతరిక్షం.. అదో అంతుచిక్కని మాయాజాలం. ఇందులో ఎన్నో గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, తోకచుక్కలు, ఉల్కలు మరె న్నో... ఎన్నెన్నో వింతలు, విడ్డూరాలు ఉన్నాయి. అ టువంటి అంతరిక్ష పరిశోధనలకు ఎస్వీయూ కేంద్రం వేదిక అవుతోంది. ఇందుకోసం ఎస్వీయూలో మీటియోర్ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ మనదేశంలో కోలాపూర్‌లో ఒక రాడార్ కేంద్రం, త్రివేండ్రంలో మరో రాడార్ కేంద్రం ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కేంద్రాన్ని ఎస్వీయూలో తొలిసారిగా ఏర్పాటు చేశారు.



    అంతరిక్షంలోని గ్రహశకలాల నుంచి వెలువడే ఉల్కపాతం, వాటి పరిణామం, వాటి దశ, దిశ మొదలైన విషయాలను శోధించడానికి మీటియోర్ రాడార్ కేంద్రం ఉపయోగపడుతుంది. దీంతో అంతరిక్ష పరిశోధనలో కీలక అంశాలైన గ్రహాంతర శకలాల ఉనికిని, భూవాతావరణంలోని మీసో(Meso)ధర్మో(Thermo)అవరణాల నిర్మాణం, ఈ పొరల మధ్య పరస్పరం జరిగే అనేక చర్యలకు గల కారణాలను కనుగొనడానికి వీలవుతుంది.

         

    ఎస్వీయూ భౌతిక శాస్త్ర విభాగంలో యూజీసీ సహకారంతో రూ.1.5 కోట్లు ఖర్చు చేసి ప్రపంచంలోనే అత్యాధునిక రాడార్‌ను ఆస్ట్రేలియాలోని అట్రాడ్ సంస్థ ద్వారా కొనుగోలు చేసి జర్మన్, ఆస్ట్రేలియన్ ఇంజనీర్ల పర్యవేక్షణలో 2 నెలల పాటు కష్టించి ఏర్పాటు చేశారు. అంతరిక్ష, వాతావరణ ప్రయోగాల కోసం అత్యాధునిక స్వంత రాడార్ వ్యవస్థను కల్గిన తొలి విశ్వవిద్యాలయం ఎస్వీయూ కావడం విశేషం.

         

    ఈ రాడార్ వ్యవస్థ పనితీరు ప్రయోగాలను ప్రొఫెసర్ విజయభాస్కర్ రావు పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రయోగాల కోసం దూరవిద్యావిభాగం పక్కను న్న ఖాళీ స్థలంలో 6 ఏంటినాలు, ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇందులో ఒక లైడార్ ఉం టుంది. దీని(లైడార్) ద్వారా రాత్రివేళల్లో కాంతి పుంజాన్ని అంతరిక్షంలోకి పంపుతారు. వాతావరణాన్ని అధ్యయనం చేస్తారు. ఈ రాడార్ 24 గం టలూ పని చేస్తుంది. ఇది 70 నుంచి 110 కిలోమీటర్లు ఎత్తులో ప్రవేశించే ఉల్కలను పరిశీలించి లెక్కిస్తుంది.

     

    ఇస్రో సహకారంతో..



    ఇస్రో సంస్థ సహకారంతో సెంటర్ ఫర్ అట్మాస్పియర్ సెన్సైస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పరిశోధనలు చేస్తున్నాం. ఈ రాడార్ వ్యవస్థ ద్వారా వచ్చిన గణాంకాలు ఇతర పరిశోధన కేంద్రాల్లో లభించిన గణాంకాలకన్నా మెరుగ్గా ఉన్నాయి. మీటియోర్ రాడార్‌తో పాటు లైడార్ వ్యవస్థను, వర్షపాతాన్ని వివ్లేషణ చేసే మైక్రో రైన్ రాడార్, డిస్ట్రో మీటర్లను ఏర్పాటు చేశాం. ఏ విశ్వవిద్యాలయంలో కూడా ఇలాంటి అధ్యయనకేంద్రం లేదు. - ప్రొఫెసర్ ఎస్.విజయభాస్కర్‌రావు, యూజీసీ, ఎస్వీయూ సెంటర్ డెరైక్టర్

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top