కాంగ్రెస్ లో చేరనున్న ఎర్రబెల్లి?

కాంగ్రెస్ లో చేరనున్న ఎర్రబెల్లి? - Sakshi


హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు కాంగ్రెస్ లో చేరనున్నారా? తాజాగా చోటు చేసుకుంటున్నరాజకీయ పరిణామాలను చూస్తే అవుననే ఊహగానాలు ఊపందుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమైన నేపథ్యంలో ఎర్రబెల్లి తన రాజకీయ భవితవ్యంపై పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి విఫలయత్నం అయ్యినట్లు కూడా తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.. తమ పార్టీలో స్థానం లేదని స్పష్టం చేశారని, ఈ పరిస్థితుల్లో మరో ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ వైపు ఎర్రబెల్లి చూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.


 


ఇందులో భాగంగానే ఆదివారం ఆయన తన అనుచరులతో సమావేశమైయ్యారని కూడా ప్రాధమిక సమాచారం.టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరిపై ఎర్రబెల్లి ధిక్కార స్వరం వినిపించేందుకు సిద్ధమయ్యారా?  రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని తనకు అనుకూలంగా మలుచకోనే ప్రయత్నాలు చేస్తున్నారా?అనేది వేచి చూడాల్సిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top