ఉద్యోగులు, అంగన్‌వాడీలపై దాడులు సిగ్గుచేటు


తణుకు : ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలపై దాడులకు దిగటం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తణుకులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒకపక్క ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తూ.. మరోపక్క అంగన్‌వాడీలపై అసభ్యకర రీతిలో ఎదురు దాడికి దిగడం టీడీపీ ఎమ్మెల్యేలకు అలవాటుగా మారిపోయిందని.. ఉద్యోగ వర్గాలపై దాడులకు పాల్పడటం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్యలాంటిదని ఆయన ధ్వజమెత్తారు.

 

  జిల్లాలో ఇసుకను, మట్టిని అక్రమంగా అమ్ముకుం టున్న టీడీపీ నాయకులు రేషన్ షాపుల్లో సైతం అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ వాత పెడుతున్నారన్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలపై  దెం దులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యానికి దిగి.. వారిని నోటికొచ్చినట్టు దూషించినా పట్టించుకునే దిక్కు లేకుండాపోయిందన్నారు. చంద్రబాబు సర్కారు పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోం దని, ఇందుకు ఎన్నో ఉదంతాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం సాగిస్తున్న అకృత్యాలు, టీడీపీ నేతల అవినీతిపై బహిరంగ చర్చకు దమ్ముంటే జిల్లా టీడీపీ నాయకులు ఎవరైనా తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.

 

 రైతు కాడి వదిలేస్తే మనుగడ లేదు

 వర్షాలు, తుపానుల కారణంగా పంట నష్టపోయి రైతులు నిర్వేదంలో ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, కనీసం మంత్రులు గాని వచ్చి పరామర్శించిన దాఖలాలు లేవని కారుమూరి విమర్శించారు. కష్టాల్లో ఉన్న రైతులకు భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటిస్తే, దీనిని కూడా రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నష్టపోయిన రైతులు జగన్ ఎదుట తమ గోడు వినిపించి న్యాయం చేయాలని కోరారని గుర్తు చేశారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం వారు ఇంట్లో దాచుకునేందుకు కాదని.. వచ్చే పంటకు పెట్టుబడిగా మాత్రమే ఉపయోగపడుతుందని అన్నారు. రైతు కాడి వదిలేస్తే మనుగడ ఉండదన్నారు. కనీసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేబినెట్‌లో చర్చించకపోవడం దారుణమన్నారు.

 

 నాయకులు ఇప్పటికైనా కళ్లుతెరిచి రైతుల బాధల్ని అర్థం చేసుకోవాలని కోరారు. ఒకపక్క రైతులను, మరోపక్క మహిళలు, నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని జనచైతన్య యాత్రల పేరుతో ప్రజల మధ్యకు వస్తారని కారుమూరి ప్రశ్నిం చారు. విలేకరుల మునిసిపల్ మాజీ చైర్మన్ బలగం సీతారామ్, నాయకుడు కడియాల సూర్యనారాయణ, వైఎస్సా ర్ సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెన్మత్స రామరాజు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూసి వినీత, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టు నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ మద్దాల నాగేశ్వరరావు, నాయకులు చోడే జోషి, వలవల బాబ్జి, కోట సత్యం, సత్తి రామిరెడ్డి, ముదిగిన సత్యనారాయణ, పొడుగు రామాచారి, పైబోయిన సత్యనారాయణ, బొద్దాని శ్రీనివాస్,  తాతయ్య, పెనుమత్స రామరాజు, బొద్దాని అనిల్ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top