తొక్కి చంపేశాయి

తొక్కి చంపేశాయి

శ్రీకాకుళం జిల్లా : ఇటీవల కాలంలో పంటలు, తోటలను ధ్వంసం చేసిన ఏనుగులు మళ్లీ మనుషులపై దాడి చేయడం ఆరంభించారుు. బంధువుల ఇంటిలో విందు భోజనానికి వెళ్లి తిరిగి వస్తున్న గిరిజనుడిని పొట్టన పెట్టుకున్నాయి. రెండు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లి తొక్కి చంపేశాయి. గుర్తుపట్టలేని విధంగా చీల్చిచెండాడిన ఘటన హిరమండలంలోని ఎగువరుగడ గిరిజన గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పాతపట్నం మండలం సోద గ్రామానికి చెందిన కీశరజోడు తవిటయ్య (70) శనివారం హిరమండలంలోని ఎగువరుగడ గ్రామంలో జరిగిన బంధువుల శుభకార్యం విందుకు హాజరయ్యాడు. 

 

 భోజనం చేసి సాయంత్రం కాలినడకన తిరుగు ప్రయాణమయ్యాడు. చీకటి పడినా ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఎగువరుగడలోని బంధువులకు ఫోన్ చేస్తే తిరుగు ప్రయాణమైనట్టు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామస్తుల సాయంతో కర్రలు, దివిటీలతో చప్పుళ్లు చేస్తూ రాత్రి సమయంలో ఆ తోవలో వెతికారు. శనివారం రాత్రి ఆచూకీ లభించ లేదు. ఆదివారం ఉదయాన్నే మళ్లీ వెతకడంతో రోడ్డుపై రక్తం మరకలు, ఏనుగుల అడుగుజాడలు కనిపిం చాయి. వాటి ఆధారంగా సుమారు రెండు కిలోమీటర్లు వెళ్తే మృతదేహం లభించింది. కాలితో తొక్కేయడంతో మృతదేహం గుర్తుపట్టలేని విధంగా తయారైంది.

 

  ఈ ఘటనను చూసిన బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. మృతినికి భార్య సరోజిని, ఇద్దరు కుమారులు ఉన్నారు. కూలిచేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఆయన మృతితో కుటుంబం వీధినపడింది. ఘటనా స్థలాన్ని తహసీల్దార్ ఎం.కాళీప్రసాదరావు, పాతపట్నం అటవీశాఖ అధికారి సోమశేఖర్, పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కె.వెంకటేశ్వరరావు కేసునమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఆదివారం సాయంత్రం మృత దేహాన్ని గ్రామానికి తెచ్చి అంత్యక్రియలు జరి పారు. గ్రామానికి వాహనాలు వచ్చే సదుపాయం లేకపోవడంతో డీలీ సాయంతోనే మృతదేహాన్ని తరలించారు. కుటుంబ సభ్యులను పాతపట్నం ఎమ్మెల్యే కలమటవెంకటరమణ పరామర్శించారు. కుటుం బాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. 

 

 ఏనుగులను తరలించాలి

 గత రెండు నెలలుగా ఎగువరుగడ గ్రామ సమీపంలో ఏనుగులు తిష్టవేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారుు. వ్యవసాయ పంటలను, తోటలను, ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశాం. ఏనుగుల నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నాం.. స్పందించకపోవడంతో గిరిజనుడు నిండు ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందంటూ గిరిజనులు ఆవేదన వ్య క్తం చేశారు. ఏనుగులు తరలించాలని కోరారు. 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top