విద్యుత్ వాటాలపై మళ్లీ వివాదం


సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్తు వాటాల వివాదం మళ్లీ రాజుకుంది. కృష్ణపట్నం, హిందూజా, దిగువ సీలేరు ప్రాజెక్టుల కరెంటులో తెలంగాణకు వాటా లేనేలేదని ఏపీ తెగేసి చెప్పింది. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి అక్కడి డిస్కంలు మంగళవారం సమర్పించిన ఏఆర్‌ఆర్‌లలో ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. కృష్ణపట్నం, హిందూజా, దిగువ సీలేరు వాటాలు నూటికి నూరు శాతం తమకే దక్కుతాయని 2015-16 ఆర్థిక అవసరాల ప్రతిపాదనల్లో ప్రస్తావించాయి.



కానీ వాస్తవానికి విభజన చట్టం ప్రకారం కృష్ణపట్నం, హిందుజా థర్మల్ కేంద్రాల నుంచి తెలంగాణ వాటాగా 53.89 శాతం, అంటే 8,396.6 మిలి యన్ యూనిట్ల విద్యుత్ రావాల్సి ఉంది.హైడల్ ప్రాజెక్టులు మాత్రం ఏ రాష్ట్ర పరిధిలో ఉన్నవి ఆ రాష్ట్రానికే చెందుతాయి. విభజన తర్వాత ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలపడంతో అక్కడి 460 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యమున్న లోయల్ సీలేరు హైడల్ ప్రాజెక్టు భౌగోళికంగా ఆ రాష్ట్రంలో చేరింది. దాంతో అందులోని వాటాను కూడా ఇచ్చే ప్రసక్తే లేదని ఏపీ తేల్చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top