రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మాఫియా నడుస్తోంది

రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మాఫియా నడుస్తోంది - Sakshi


తిరుపతి : రాష్ర్టంలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ మాఫియా నడుస్తోందని చంద్ర గిరి ఎమ్మెల్యే చెవి రెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. మంగళ వారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో అయన విద్యారంగ సమస్యలను ప్రస్తావించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య హామీని గతంలో 1999 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలాగే అటకెక్కించేస్తారా అని ఆయ న ప్రశ్నించారు. 1999 ఎన్నికల్లో బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ప్రకటించి టీడీపీ మాట తప్పిన సంగతిని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గుర్తు చే శారు.

 

ఒక వేళ ఇచ్చిన హామీని అమలు చేయడానికి సిద్ధంగా ఉంటే రాష్ట్రంలోని మొత్తం విద్యార్థినుల సంఖ్య, వారికి ఒక విద్యాసంవత్సరానికి అయ్యే ఖర్చు, అందుకు బడ్జెట్ కేటాయింపుల వివరాలు ఇవ్వాలని చెవిరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్‌టీఈ చట్టం కింద ప్రతి విద్యార్థికి ఉచితంగా విద్య అందివ్వాల ని కేంద్రప్రభుత్వం సూచించిందని అసలు రాష్ట్రంలో ఈ చట్టం అమలు అవుతోందా లేదా సూటిగా సమాధానం చెప్పాలని భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. నారాయణ, చైతన్య లాంటి విద్యాసంస్థలకు ఆర్‌టీఈ వర్తిస్తుందా లేదా చెప్పాలన్నారు. నామినేటెడ్ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో రాష్ర్టం లో ఎడ్యుకే షన్ మాఫియా నడుస్తోందని ఆయన ఆరోపించారు.

 

సౌకర్యాలన్నీ లేకపోయినా పల్లెలు, పట్టణాల్లో కాలేజీలు నెలకొల్పి బ్రాండ్ ఇమేజ్‌ను అడ్డంగా పెట్టుకుని తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు ఫీజులు వసూలు చేసి వారిని అప్పులపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎడ్యుకేషన్ మాఫియాలాగా విద్యాసంస్థలను నడుపుతున్న మంత్రి నారాయణను ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తోందో తమకు అర్థం కావడం లేదన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఐప్యాడ్లు ఇస్తారా? ఎంపీ ల్యాడ్స్ నిధులతో బాలికల హాస్టళ్లకు మరుగుదొడ్లు నిర్మించుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో అందుకు రాష్ర్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పాటించే చర్యలేవైనా తీసుకుంటున్నారా? అంటూ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. ఎన్నికల హామీలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు సమాధానం చెప్పారని భాస్కర్‌రెడ్డి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top