ఏప్రిల్ 2న తలనీలాల ఈ-వేలం


తిరుమల : తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన తలనీలాలను విక్రయించడానికి ఏప్రిల్ 2వ తేదీన ఈ-వేలం నిర్వహించనున్నారు. ప్రతీనెలా మొదటి గురువారం ఈ-వేలం నిర్వహించాలని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విశాఖపట్నంలోని మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎస్‌టీసీ) లిమిటెడ్ సంస్థల్లోని ఈ-వేలం ద్వారా గురువారం టీటీడీ తలనీలాలు విక్రయించనుంది. ఆసక్తిగల బిడ్డర్లు తిరుపతిలోని టీటీడీ జనరల్ మేనేజరు(వేలం) కార్యాలయంలోని 0877-2264429 నంబరును సంప్రదించవచ్చని టీటీడీ ప్రజా సంబంధాల విభాగం తెలిపింది.



శ్రీవారి దర్శనానికి 9 గంటలు :

తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తగ్గింది. గదులు సులభంగా లభించాయి. సాయంత్రం 6 గంటల వరకు 46,848 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అలానే సర్వదర్శనం కోసం 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 9 గంటల్లో, కాలిబాట భక్తులకు 4 గంటల్లో స్వామి దర్శనం లభించింది. కాగా, మంగళవారం రూ.3.24 కోట్లు హుండీ కానుకలు లభించాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top