గూడూరు డిఎస్పీ గిరిపై తప్పిన గురి

గూడూరు డిఎస్పీ గిరిపై తప్పిన గురి - Sakshi


గతంలో గూడూరులో డీఎస్పీ పోస్టింగ్‌ కోసం పోలీసు సిబ్బంది పోటీ పడే వారు. ఇక్కడ పోస్టింగ్‌ కోసం ఉన్నత స్థాయిలో పైరవీలు సైతం చేసేవారు. కానీ తాజాగా క్రికెట్‌ బెట్టింగ్‌ వంటి అవినీతి ఆరోపణలతో గూడూరు డీఎస్పీ శ్రీనివాస్‌ను ఎస్పీ రామకృష్ణ వీఆర్‌కు పంపడంతో ఇక్కడకు వచ్చేందుకు డీఎస్పీలు జంకుతున్నారు.



గూడూరు:  గూడూరు పోలీసు సబ్‌డివిజన్‌ 16 మండలాలు ఉన్నాయి. డివి జన్‌ పరిధిలో శాంతి భద్రతల సమస్య తక్కువగా ఉంటుంది. తమిళనాడు సరిహద్దు ప్రాంతం కాడంతో ఇసుక, సిలికా, ఎర్రచందనం స్మగ్లర్ల ద్వారా పెద్ద ఎత్తున మామూళ్లు వస్తుం టాయి. దీంతో గూడూరు డీఎస్పీగా వచ్చేందుకు పోలీసు సిబ్బంది ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.



ఇక్కడ పోస్టింగ్‌ కోసం ఉన్నత స్థాయిలో పైరవీలు సైతం చేస్తుంటారు. గూడూ రు డీఎస్పీగా ఒకరు బదిలీపై వెళ్లిన రోజే మరొకరు బాధ్యతలు చేపడుతుం టారు. అలాంటి గూడూరు డీఎస్పీ కుర్చీ 20 రోజులుగా ఖాళీగా ఉండడం విశేషం. క్రికెట్‌ బెట్టింగ్‌ వంటి అవినీతి ఆరోపణలతో గూడూరు డీఎస్పీ శ్రీనివాస్‌ను ఎస్పీ రామకృష్ణ వీఆర్‌కు పంపడంతో ఇక్కడకు వచ్చేందుకు డీఎస్పీలు వెనుకడుగు వేస్తున్నారు.



డీఎస్పీ నుంచి ఎస్పీ స్థాయికి

గూడూరు పోలీస్‌ సబ్‌డివిజన్‌ 1953లో ఏర్పాటైంది.  ఇక్కడ డీఎస్పీలుగా పనిచేసిన వీఎస్‌ వ్యాస్, అశోక్‌ దళవాయ్, ఎం గోపీకృష్ణ వంటి వారు గొప్ప ఐపీఎస్‌ అధికారులుగా పేరు గడించారు. గ్రూప్‌–1 అధికారులైన బీవీ రమణకుమార్, వీవీఎస్‌ రామకృష్ణ గూ డూరులో డీఎస్పీలుగా పనిచేశారు. అనంతరం జిల్లా ఎస్పీలుగా బా ధ్యతలు చేపట్టారు. అప్పట్లో వీరు నిబద్ధతతో పని చేసి ప్రజల ఆదరాభిమానాలను పొందారు.  ఆ తరువాత బాధ్యతలు స్వీకరించిన పలువురు డీఎస్పీలు సైతం ప్రజల మన్ననలను కొంత మేర పొం దారు. 2011 తరువాత డీఎస్పీ కుర్చీకి ఉన్న గౌరవం క్రమంగా మసకబారుతూ వస్తోంది.



  2011 నవంబరు నుంచి 2013 జనవరి వరకు గూడూరు డీఎస్పీగా పనిచేసిన సురేష్‌కుమార్‌ అప్పట్లో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2013 జనవరి 23న డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన హనుమంతరావు కేవలం 3నెలలు మాత్రమే పనిచేశారు. అనంతరం తొలి మహిళా డీఎస్పీగా చౌడేశ్వరి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన తనను అన్యాయంగా బదిలీ చేశారని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.  అనంతరం డీఎస్పీ చౌడేశ్వరి 2014 అక్టోబరు 11న  పలు ఆరోపణలతో బదిలీ అయ్యారు. ఆ మరుసటి రోజే గూడూ రు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బాదిపల్లి శ్రీనివాస్‌ను ఈ ఏడాది జూలై 31న  క్రికెట్‌ బెట్టింగ్‌తో పాటు సిలికా, ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహించి మామూళ్ల మారాజుగా పేరు తెచ్చుకుని వీఆర్‌కు బదిలీ అయ్యారు.



 నివాసాన్ని సైతం మార్చుకుని

మున్సిపల్‌ కార్యాలయం పక్కనే డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసినప్పట్నుంచి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వారంతా వెనుకగా ఉండే గదుల్లో నివాసం ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండేవారు. కానీ శ్రీనివాస్‌ అందుకు భిన్నంగా సొసైటీ ప్రాంతంలో భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. దీంతో సామాన్య ప్రజలు ఆయన ఇంటికెళ్లి తమ బాధలు చెప్పుకునేందుకు భయపడుతూ, ఆయన కార్యాలయానికి ఎప్పుడు వస్తారో తెలియక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.



అప్పట్లో తనను కలిసే వారి వివరాలు తెలియకుండా ఉండేందుకు డీఎస్పీ అద్దె భవనం తీసుకున్నారని ఆరోపణలు గుప్పుమన్నాయి. డివిజన్‌ పరిధిలో ఎర్రచందనం, ఇసుక, సిలికా అక్రమ రవాణాకు స్మగ్లర్ల నుంచి భారీగా ముడుపులు పుచ్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గూడూరు డీఎస్పీ శ్రీనివాస్‌ నెలకు రూ.కోటి అడుగుతున్నారని, గతంలో సూళ్లూరుపేట ఎస్సై జగన్‌మోహన్‌రావు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం కూడా పెద్ద చర్చనీయాంశమైంది.  

 

డీఎస్పీల వెనకడుగు


గతంలో గూడూరు డీఎస్పీగా రావా లంటే ఉన్నత స్థాయి సిఫార్సుతో పాటు భారీగా ముడుపులు చెల్లించాలనే పుకార్లు షికార్లు చేసేవి. ఇక్కడకు వచ్చిన డీఎస్పీలు అయిష్టంగా తిరిగి వెళుతుండడంతో అది నిజమన్న నానుడి క్రమంగా ప్రజల్లో నెలకొంది. జిల్లా ఎస్పీగా రామకృష్ణ బాధ్యతలు స్వీకరించినప్పట్నుంచి పోలీసు యంత్రాంగాన్ని గాడిన పెడుతున్నారు. బెట్టింగ్‌రాయులు, స్మగ్లర్లకు అండగా నిలుస్తున్న పోలీసు సిబ్బందిపై నిఘా ఉంచి వీఆర్‌కు పంపుతున్నారు. ఈ క్రమంలోనే గూడూరు డీఎస్పీ శ్రీనివాస్‌ను వీఆర్‌కు పంపారు. గతంలో పోస్టింగ్‌ కో సం పోటీపడే డీఎస్పీలు ఎవరూ ప్రస్తుతం బా« ద్యతలు స్వీకరించేందుకు ముం దుకు రాకపోవడం విశేషం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top