మాతృశాఖకు డీఆర్‌డీఏ పీడీ జ్యోతి

మాతృశాఖకు డీఆర్‌డీఏ పీడీ జ్యోతి


 సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ప్రాజెక్టు డెరైక్టర్ జ్యోతికి రీపేట్రియేట్ (మాతృ సంస్థకు పం పుతూ) ఉత్తర్వులొచ్చాయి. డిప్యుటేషన్‌పై కొనసాగుతున్న ఆమెను బాధ్యతల నుంచి రిలీవ్ చేసి, మాతృ శాఖకు పంపించి వేయాలని ఆ ఉత్తర్వుల్లో అటవీ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. రిలీవైన తర్వాత ఎన్విరాన్‌మెంట్, ఫారెస్టు స్టేట్ హెడ్ ఆఫీస్‌కు రిపోర్టు చేయాలని జ్యోతికి సూచించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ ఫైలు కలెక్టర్ వద్ద ఉంది. రిలీవింగ్ విషయంలో ఆయన నిర్ణయం తీసుకోవల్సి ఉంది. వాస్తవానికి రీ పేట్రియేట్ ఉత్తర్వులు ఈ ఏడాది ఫిబ్ర వరిలో కూడా వచ్చాయి. కానీ అప్పట్లో ఎన్నికల దృష్ట్యా, ఆమె సేవలు ఇక్కడ అవసరమని అప్పటి కలెక్టర్ కాంతిలాల్ దండే సంబంధిత ఉన్నతాధికారులను కోరారు. దీంతో అప్పట్లో కొనసాగడానికి అవకాశమిచ్చారు.

 

 సరిగ్గా ఆరు నెలలకు అటవీశాఖ మళ్లీ రీపేట్రియేట్ ఉత్తర్వులు జారీ చేసింది. డీఆర్‌డీఏ పీడీగా 2012 డిసెంబర్ 27న  జ్యోతి  బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు సామాజిక అటవీశాఖ డివిజనల్ ఫారెస్టు ఆఫీసర్‌గా పని చేశారు. సాధారణంగా ఫారెన్ సర్వీసులో భాగంగా వేరే శాఖల్లో ఐదేళ్లు వరకు పనిచేసే అవకాశం ఉంది. కానీ కారణమేంటో తెలియదు గాని జ్యోతి విషయంలో రెండోసారి రీపేట్రియేట్ ఉత్తర్వులు రావడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, రీపేట్రియేట్ ఉత్తర్వుల విషయమై డీఆర్‌డీఏ పీడీ జ్యోతి వద్ద ‘సాక్షి ప్రతినిధి’ ప్రస్తావించగా ఎన్విరాన్‌మెంట్, ఫారెస్టు నుంచి రీ పేట్రి యేట్ ఉత్తర్వులు కలెక్టర్‌కు రావడం వాస్తవమేనని, కాకపోతే ప్రస్తుతం రూరల్ డెవలప్‌మెంట్ కంట్రోల్‌లో పని చేస్తున్నందున వారి నుంచి కూడా ఉత్తర్వులు రావల్సి ఉందని తెలిపారు. ఆర్‌డీ ఉత్తర్వులొచ్చిన తర్వాత వేరొకరికి బాధ్యత  లు అప్పగించి, తనను రిలీవ్ చేసే చేసే అవకాశం ఉందని చెప్పారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top