కాలువలు కబ్జా

కాలువలు కబ్జా - Sakshi


రాజంపేట: ఎన్నో ఏళ్లుగా రైతులకు ఉపయోగపడిన ఊటకాలువలు (స్ప్రింగ్ చానల్స్) ఆక్రమణదారుల చెరతో రూపురేఖలు మార్చుకుంటున్నాయి. చెయ్యేరు నది వెంబడి స్ప్రింగ్‌చానల్స్ ఆక్రమణలు చాపకిందనీరులా సాగుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక తెలుగుతమ్ముళ్ల కన్ను స్ప్రింగ్‌చానల్స్‌పై పడింది.  కాల్వలు  ఆక్రమించుకోవడం.. అనంతరం వాటిని ధ్వంసం చేసి తమ పంటపొలాలకు దారులు కల్పించుకోవడం జరుగుతోంది. అంతేగాకుండా ఊటకాల్వల కట్టడాలను కూడా కూలదోస్తున్నారు.



చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతంలో ప్రధానంగా ఈ ఊటకాల్వలు ఉన్నాయి. మట్లిరాజుల కాలం నుంచి ఈ కాల్వలు రైతులకు సాగునీరు అందిస్తున్నాయి. రైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలంలోని నారాయణనెల్లూరు గ్రామ పరిధిలో తాజాగా ఊటకాల్వలను ధ్వంసం చేయడమే కాకుండా, కల్వర్టును  కూడా తొలిగించి  యథేచ్చగా ఆక్రమణలకు పాల్పడిన విషయం నీటి  పారుదలశాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. సంబంధిత శాఖ డీఈ మురళీ సంఘటన స్థలానికి చేరుకుని ఊటకాల్వలను పరిశీలించారు.  అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు.



 రాజంపేట డివిజన్‌లోని  రాజంపేటలో రెండు, నందలూరులో 9, పెనగలూరులో 10 ఊటకాల్వలు ఉన్నాయి. ఇప్పుడు వీటి గురించి పట్టించుకునే  అధికారి కరవయ్యాడు.  ఊటకాల్వల అభివృద్ధికి గతంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు.  టీడీపీ అధికారంలోకి రాగానే తెలుగుతమ్ముళ్లు వాటిని కబ్జా చేసేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఆక్రమణల విషయమై ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు దృష్టికి పలువురు రైతులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

 

 మండలం        ఊటకాల్వ పేరు        ఆయకట్టు/

                                             ఎకరాలలో

 రాజంపేట        గుండ్లూరు            166.17

                    మందపల్లె            230.43

 నందలూరు    ఆడపూరు              216.04

                నల్లతిమ్మాయపల్లె       219.69

                  పొత్తపి                   101.05

                 నూకినేనిపల్లె            276.73

                కుందానెల్లూరు           295.60

 పెనగలూరు    నారాయణనెల్లూరు    182.67

                  నల్లపురెడ్డిపల్లె         140.34

                  ఇండ్లూరు               122.50

                  సిద్ధవరం                232.73

                  తిరుమలరాజుపేట     130.95

                   సింగారెడ్డిపల్లె          123.69

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top