ఎన్నాళ్లీ పరీక్ష..?

ఎన్నాళ్లీ పరీక్ష..? - Sakshi


► గాడిన పడని వర్సిటీ పరీక్షల నిర్వహణ వ్యవస్థ

► పెరుగుతున్న కళాశాలలు

► కానరాని ప్రత్యేక పరీక్షల నిర్వహణ అధికారులు  

►నష్టపోతున్న విద్యార్థులు


ఎచ్చెర్ల క్యాంపస్‌ : జిల్లాలోని డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ యూనివర్సిటీ పరిధిలో పరీక్షల నిర్వహణ వ్యవస్థ లోపభూయిష్టంగా మారింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక వ్యవస్థ, అధికారుల నియామకం జరగకపోవడంతో తరచూ వైఫల్యాలు ఎదురవుతున్నాయి. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు. 2008లో ఏర్పాటైన ఈ వర్సిటీకి 2010లో ప్రభుత్వం డిగ్రీ, పీజీ, బీఎడ్‌ కళాశాల అఫిలియేషన్‌ బాధ్యత అప్పగించింది. ఈ నేపత్యంలో ఏటా అనుబంధ కళాశాలల సంఖ్య పెరుగుతూ వస్తోంది.


వర్సిటీ పరిధిలో 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 88 ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలు, 13 పీజీ కళాశాలు, 17 బీఎడ్‌ కళాశాలు, ఐదు ఎంఎడ్‌ కళాశాలు ఉన్నాయి. సుమారు 50 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి వార్షిక పరీక్షల స్థానంలో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని కోర్సులకు సంబంధించి వార్షిక, సప్లిమెంటరీ పరీక్షల ప్రశ్నపత్రాలు రూపొందించాల్సి ఉంటుంది. కామన్‌ కోర్‌ సిలబస్‌లో తరచూ మార్పుల నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ కీలకం కానుంది. ఈ పరిస్థితిలో పరీక్షల నిర్వహణ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి.


పీజీ, డిగ్రీ స్థాయిలో వేర్వేరు నిర్వహణ వ్యవస్థలు, చీఫ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ వంటి పోస్టులను భర్తీ చేయాలి. ఇక్కడ మాత్రం ఆ వ్యవస్థ లేదు. విశ్రాంత, ఒప్పంద ఉద్యోగులతోనే పరీక్షల నిర్వహణను నెట్టుకువస్తున్నారు. ప్రశ్నపత్రాల డిజైనింగ్, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ సిలబస్‌ ఆధారంగా ప్రశ్నపత్రం డిజైన్, స్ట్రాంగ్‌ రూంలకు ప్రశ్నపత్రాలు చేర్చడం వంటివి పరీక్షల నిర్వహణ కీలకం. అయితే సరైన పరీక్షల నిర్వహణ వ్యవస్థ లేకపోవడంతో తరచూ వైఫల్యాలు సంభవిస్తున్నాయి.


మొదటి రోజే వైఫల్యం..!

ఇటీవల జరిగిన డిగ్రీ రెండో సెమిస్టర్‌ ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రం మార్పు చర్చనీయాంశమైన సంగతి తెలి సిందే. ఏప్రిల్‌ 17 నుంచి పరీక్షలు ప్రారంభం కాగా,      మొ దటి రోజే పరీక్ష నిర్వహణలో అధికారులు వైఫల్యం కనిపించింది. 2015 –16, 2016–17 ఏడాది సిలబస్‌లు పరిశీలిస్తే కామన్‌ కోర్‌ సిలబస్‌లు మారిపోయాయి. గ్రూపుల్లో మార్పులు లేకున్నా ఇంగ్లిష్, సంస్కృతం, ఫౌండేషన్‌ లాంగ్వేజ్‌లలో మార్పులు వచ్చాయి. గత ఏడాది బ్యాక్‌లాగ్‌ విద్యార్థులు సప్లమెంటరీలో పరీక్షలు రాస్తున్నారు. వీరికి, ప్రస్తుతం రెగ్యులర్‌ పద్ధతిలో పరీక్ష రాస్తున్న విద్యార్థులకు వేర్వేరు ప్రశ్నపత్రాలు రూపొందించాలి.


అధికారులు రెండు ప్రశ్నపత్రాలు వేర్వేరుగా రూపొందిం చినా 75 మార్కుల్లో 50 శాతానికి పైగా కొత్త సిలబస్‌ నుంచే ప్రశ్నలు వచ్చాయి. 1100 మంది విద్యార్థులు ఇంగ్లిష్‌ రెండో సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్ష రాశారు. వాస్తవంగా 50 శాతం సిలబస్‌ దాటి వస్తే పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి. అధికారులు మాత్రం 20 శాతం మాత్రమే ప్రశ్నలు మారినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రశ్నపత్రం నిర్థారణ బాధ్యతను బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌కు అప్పగించారు. మరోవైపు ఈ ఏడాది డిగ్రీ చివరి సంవత్సరంతో వార్షిక పరీక్షల పద్ధతి ముగియనుంది.


గతంలోనూ వైఫల్యాలు...

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ వ్యవస్థలో గతంలోనూ అనేక వైఫల్యాలు బయటపడ్డాయి. చివరకు ప్రశ్నపత్రాల లీకేజ్‌ అంశం సైతం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పటికీ కేసు మూతపడింది. ఇంత జరుగుతున్నా పరీక్షల నిర్వహణ తీరు మాత్రం మెరుగుపడటం లేదు. 2015 మార్చిలో నిర్వహించిన ఫిజిక్స్‌–1, ఫిజిక్స్‌–2, కెమిస్ట్రీ–2 పరీక్షలను లీకేజీ కారణంగా రద్దు చేశారు. అప్పటి రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌ ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు. అయితే ఆధారాలు దొరకలేదన్న కారణంతో ఈ ఏడాది జనవరి 2న కేసు మూసివేశారు. 


విద్యార్థులకు అన్యాయం జరగనివ్వం

పరీక్షల నిర్వహణలో చిన్నచిన్న లోపాలు దొర్లి నా విద్యార్థులకు అన్యా యం జరగనివ్వం. తర చూ మారుతున్న కామన్‌ కోర్‌ సిలబస్‌ సమస్యగా ఉం టోంది. ప్రస్తుతం రెండో సెమిస్టర్‌కు సంబ ంధించి రెగ్యులర్‌ విద్యార్థులకు, సప్లమెంటరీ వి ద్యార్థుల వేర్వేరు ప్రశ్నపత్రాలు డి జైన్‌ చేస్తున్నాం. ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రానికి సంబంధించి బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌తో ప్రామాణికతను నిర్థారించి విద్యార్థులకు అదనపు మార్కులు ఇవ్వడమో, పరీక్ష రద్దు చేయడమో చేపడతాం. భవిష్యత్తులో ఎటువంటి తప్పులు దొర్లకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తాం. – ప్రొఫెసర్‌ తమ్మినేని కామరాజు, ఎగ్జామినేషన్స్‌ డీన్, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top