దొనకొండ ఉత్తమం


* గుంటూరు, కృష్ణా ప్రాంతాలు రాజధానికి అనువు కాదు

* చంద్రబాబుకు సిటిజన్స్ ఫోరం వినతి


 

 సాక్షి, హైదరాబాద్: ‘‘ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి గుంటూరు, కృష్ణా జిల్లా ప్రాంతాలు అనుకూలమైనవి కావు. ఆ ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు అనేక సమస్యలకు దారి తీస్తుంది’’ అని సిటిజన్స్ ఫోరం ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విన్నవించారు. ప్రకాశం జిల్లా దొనకొండ పరిసర ప్రాంతాలను రాజధానికి ఎంపికచేయడం ఉత్తమమని సూచించారు.

 

 వారు సోమవారం సీఎంను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రాంతాల ప్రతికూలతలు, దొనకొండ  పరిసరాల అనుకూలతలను అందులో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కె.జయభారత్‌రెడ్డి, ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గోపాలరావు, పర్యాటక సంస్థ మాజీ సీఎండీ సి.ఆంజనేయరెడ్డి, ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి జి.కుమారస్వామిరెడ్డి, రిటైర్డ్ జడ్జి జస్టిస్ లక్ష్మణ్‌రె డ్డి, ఏపీఎస్‌ఈబీ మాజీ చీఫ్ ఇంజనీర్ వెంకటస్వామి, రిటైర్డ్ ఐజీ ఎ.హన్మంత్‌రెడ్డి, ఆదాయ పన్ను శాఖ మాజీ చీఫ్ కమిషనర్ జి.ఆ ర్.రె డ్డి తదితరులు బృందంలో ఉన్నారు.

 

 ‘‘రాజధాని ప్రాంతం మరోసారి విభజనకు దారితీయకూడదు. కోస్తాంధ్ర, రాయలసీమ నేతల మధ్య కుదిరిన శ్రీబాగ్ ఒప్పందం ప్రకా రం మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా అవతరిం చిన ఆంధ్ర రాజధానిని కర్నూలులో, హైకోర్టును గుంటూరు లో ఏర్పాటుచేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన ప్రస్తుత తరుణంలో.. ఏపీ రాజధాని తమ ప్రాంతంలో నే ఏర్పడుతుందని కర్నూలులో కాకున్నా రాయలసీమలోనే ఎక్కడైనా పెడతారని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. కానీ రాజధాని గుంటూరు-విజయవాడ మధ్యలో ఉంటుందని, బాబు అభిప్రాయమూ అదేనని వార్తలొస్తున్నాయి. ఇరుప్రాం తాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా, వారికి అనుకూలమైన ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయాలి’’ అని పేర్కొన్నారు. వినతిపత్రంలోని ప్రధానాంశాలు ఇవీ..

 

 గుంటూరు-విజయవాడ ప్రతికూలతలివే...

 - రాయలసీమకు చాలా దూరం

 - ఈ ప్రాంతం ఇప్పటికే చాలా ఇరుకుగా మురికివాడలతో కిక్కిరిసి ఉంది

 - భూముల ధరలు అత్యధికం. సొంత, అద్దె వసతి మధ్యతరగతి ప్రజలకు అసాధ్యం. సామాన్యులకైతే గగనమే

 - తరచూ తుపాన్లు, వడగాడ్పులు ఎక్కువ

 - ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న మురుగు నీటిపారుదల వ్యవస్థ, రాజధాని ఏర్పాటైతే మరింత దారుణమవుతుంది

 

 దొనకొండ ప్రాంతం అనుకూలతలివే...

 - దొనకొండ, కురిచేడు, కొనకలమెట్ల, మార్కాపురం, పెద్దారవీడు, దర్శి, పొదిలి, త్రిపురాంతకం మండలాల్లోని ఖాళీ భూములు రాజధానికి అనువైనవి. ఠికోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల సంగమమైన ఈ ప్రాంతాన్ని రెండు ప్రాంతాల ప్రజలూ తమ సొంత ప్రాంతంగానే భావిస్తారు

 - ఈ ప్రాంతంలో 1.5 లక్షల ఎకరాల ప్రభుత్వ ఖాళీ భూమి ఉంది. కాబట్టి నిర్మాణాలకు భూమి అందుబాటులో ఉండడంతో పాటు అభివృద్ధికి అవసరమైన నిధులు సమీకరించడానికి వీలవుతుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top