రైల్వేజోన్‌ సాధించే వరకూ పోరాటం ఆగదు

రైల్వేజోన్‌ సాధించే వరకూ పోరాటం ఆగదు - Sakshi


ఆత్మగౌరవ యాత్ర ముగింపు సభలో వైఎస్సార్‌సీపీ నేతలు



సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో మాట్లాడే ధైర్యం రాష్ట్ర టీడీపీ, బీజేపీ నాయకులకు లేదని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. విశాఖకు రైల్వే జోన్‌ కోసం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర ఆదివారం ముగిసింది. గత నెల 30న అనకాపల్లిలో ప్రారంభమైన ఈ యాత్రలో అమర్‌నాథ్‌ 201 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. చివరి రోజు ఆదివారం తగరపువలస జంక్షన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో మి«థున్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక జోన్, ప్యాకేజీ తెస్తాం.. పరిశ్రమలు తెస్తామని ఇక్కడ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు, ఆ పార్టీ ఎంపీలు ఢిల్లీలో మాత్రం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రైల్వేజోన్‌ వస్తే ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు.



మూడేళ్లయినా పట్టించుకోకపోవడం దారుణం

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఏడాదిలో రైల్వేజోన్‌ తీసుకురాకపోతే రాజీనామా చేస్తామన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మూడేళ ్లయినా పట్టించుకోకపోవడం దారుణ మన్నారు. కేంద్రంలో అధికార పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న విశాఖ ఎంపీ హరిబాబు సైతం రైల్వేజోన్‌ విషయంలో చిత్తశుద్ధి చూపడం లేదని దుయ్యబట్టారు. ప్రత్యేక రైల్వే జోన్‌ పోరాటం ఇక్కడితో ఆగదని, జోన్‌ సాధించే వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతూనే ఉంటుందని గుడివాడ అమర్‌నా«థ్‌ స్పష్టంచేశారు. 11 రోజుల యాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top