బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి


 గజపతినగరం: ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన నయ వంచకులను తక్షణమే అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. బొండపల్లి మండలం బోడసింగిపేట గ్రామానికి బి. ఆనంద్ అనే విద్యార్థి అదే గ్రామానికి చెందిన విద్యార్థినిని ప్రేమించి పెళ్లి చే సు కుంటానని చెప్పి మోసం చేశాడని ప్రస్తుతం అవిద్యార్థి వయస్సు 17సంవత్సరాలని చెబుతూ తప్పించుకు తిరుగుతన్నాడని మండిపడ్డారు. సర్టిఫికెట్లతో సంబంధం లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించి నిందితుడికి ఇచ్చిన  బెయిల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

 

 అలాగే దత్తిరాజేరు మండలంలోని చిన చామలాపల్లిలో మోసానికి గురైన యువకుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి గర్భం తొలగించిన గజపతినగరం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ప్రసన్నలక్ష్మిని, అలాగే పెదమానాపురం ఎస్సై మహేష్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని పట్టుబట్టారు.  బాధితులకు న్యాయం జరగని పక్షంలో జిల్లా అంతటా ఆందోళనలను ఉద్ధృతం చేయనున్నట్లు హెచ్చరించారు.  ఈ సందర్భంగా సీఐ, వి. చంద్రశేఖర్ మాట్లాడుతూ  బాధితులకు తగు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని  ఆందోళనకారుకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్, జిల్లా కార్యదర్శి,బుగత ఆశోక్, ఏఐఎస్‌ఎఫ్, జిల్లా సహయ కార్యదర్శి సాయికిరణ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాయిరమణమ్మ, ఎల్, పుణ్యవతి, ఎస్.కె. చాంద్ బీబీ తదితరులు పాల్గొన్నారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top