ఆశలు ఔట్


క్రమబద్ధీకరణలో జిల్లా సిబ్బందికి నో చాన్స్

 రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మెలిక పెట్టడంపై ఆగ్రహం

 నిరాశకు గురైన వేలాదిమంది కాంట్రాక్టు ఉద్యోగులు


 

 అరకొరజీతంతో కుటుంబాలను నెట్టుకొస్తూ ఎప్పటికైనా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తారన్న ఆశతో  ఎన్నోవ్యయ ప్రయాసలకోర్చి విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపింది. చేశామని గొప్పలు చెప్పుకునేందుకే అన్నట్టుగా  1994కు మందు కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్  విధానంలో చేరిన ఉద్యోగులను మాత్రమే  రెగ్యులర్ చేస్తామని ప్రకటించడంతో మిగతావారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. జిల్లాలో ఇలా చేరిన వారు దాదాపు లేరని చెప్పాలి.

 

 దీంతో జిల్లా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగాలకు క్రమబద్ధీకరణ అందని ద్రాక్షే.

 విజయనగరం ఫోర్ట్:  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన  చంద్రబాబు సర్కార్ మిగతా హామీల  మాదిరిగానే మాటమార్చింది. దీంతో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురివుతున్నారు. జిల్లాలో ఉన్న చాలా శాఖల్లో  కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్  విధానంలో దాదాపు ఐదు వేల మంది  పనిచేస్తున్నవారున్నారు. రెగ్యులర్ అవుతుందని ఆశపెట్టుకున్న్ట ఉద్యోగులు... చంద్రబాబు పెట్టిన మెలికతో చిత్తయ్యారు. 1994కు మందు కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్  విధానంలో చేరిన ఉద్యోగులను రెగ్యూలర్ చేస్తామని  మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

 

 1997 తరువాత నుంచే అధికం

 1997 నుంచి 2004 వరకు చంద్రబాబు పాలనలో కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్  నియామకాలు రాష్ట్రంలో అధికంగా జరిగాయి.  1994 కు ముందు చేరిన వారు అతి తక్కువ మంది  ఉన్నారు. వీరిని రెగ్యూలర్ చేయడం వల్ల ప్రభుత్వం పై పెద్దగా భారం పడదు. అందుకే ఈ మెలిక పెట్టారని కాంట్రాక్ట్ ఉద్యోగులు వాపోతున్నారు.  

 

 నిరాశకు గురైన కాంట్రాక్టు ఉద్యోగులు:

 తాము అధికారంలోకి వస్తే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హమీ ఇవ్వడంతో తమ కష్టాలు తొలుగుతాయని వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.  ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తే తమ కష్టాలు తొలగిపోతాయని కొత్త ప్రభుత్వం గద్దె ఎక్కిన నాటి నుంచి వారు చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు.  అయితే మంత్రివర్గ ఉపసంఘం పెట్టిన మెలిక వారికి తీవ్ర నిరాశనిస్పృహకు గురిచేసింది.  

 

  వైద్య విధాన్ పరిషత్, వైద్య ఆరోగ్యశాఖ, ఆరోగ్యశ్రీ,ఎయిడ్స్ నియంత్రణశాఖ,ఐసీడీఎస్, విద్యశాఖ, మున్సిపాల్టీ, విద్యుత్‌శాఖ, 108, 104, వయోజన విద్య, రెవెన్యూ, పశు సంవర్ధకశాఖ, ఉపాధిహామీశాఖల్లో  వేలాది మంది కాంట్రాకు,ఔట్ సోర్సింగ్  ఉద్యోగులు పనిచేస్తున్నారు. వైద్య విధాన్ పరిషత్‌లో 64 మంది, వైద్య ఆరోగ్యశాఖలో 660 మంది ,108లో 145 మంది, ఎయిడ్స్ నియంత్రణశాఖలో 54 మంది,104లో 116 మంది, విద్యశాఖలో 500 మంది, ఐసీడీఎస్‌శాఖలో 51 మంది ,పంచాయతీరాజ్‌శాఖలో 64మంది,విద్యుత్‌శాఖలో 600 మంది,  పశు సంవర్ధశాఖలో 800 మంది, రెవెన్యూశాఖలో 30 మంది, వయోజన విద్య 1200మంది,మున్సి పాల్టీలో 100 మంది, కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ పద్ధతిలో  పనిచేస్తున్నారు.

 

 అన్యాయం


 ఎన్నికల మందు కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ రెగ్యులర్ చేస్తానని చెప్పిన చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు 1994 కు మందు విధుల్లో చేరిన వారిని మాత్రమే  రెగ్యులర్‌చేస్తానని  ప్రకటించడం అన్యాయం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల అందర్నీ రెగ్యులర్ చేయాలి.

                                                                           - పెంకి ఇజ్రాయిల్, వైద్య ఉద్యోగుల సంఘం   జిల్లా అధ్యక్షుడు



 హామీ మేరకు క్రమబద్ధీకరించాలి

 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు  కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ క్రమబద్ధీకరించాలి. అధికారంలోకి రాకముందు ఒక విధంగా, వచ్చిన తర్వాత మరో విధంగా మాట్లాడడం తగదు.  జిల్లాలో  వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరిని రె గ్యులర్ చేయాలి.

                                                      - జి.అప్పలసూరి, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్  ఉద్యోగుల సంఘం అధ్యక్షులు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top