జిల్లాకు జ్వరమొచ్చింది

జిల్లాకు జ్వరమొచ్చింది - Sakshi

  •      కన్నంపేటను పీడిస్తున్న విషజ్వరాలు

  •      ఒకరు మృతి

  •      సర్పంచ్ ఇంటిలో అందరూ బాధితులే

  • రావికమతం : జిల్లాలో ఏజెన్సీతోపాటు, మైదానం వాసులను జ్వరాలు పీడిస్తున్నాయి. కన్నంపేటలో విషజ్వరాలు విజృంభించాయి. ఒకరిని పొట్టన పెట్టుకోగా,ప్రతి ఇంటా ఇద్దరు ముగ్గురు బాధితులు ఉన్నారు. రోలుగుంట మండలం వడ్డిపలోనూ ఇదే పరిస్థితి. కొద్ది రోజులుగా రెండు గ్రామాలను జ్వరాలు వీడడం లేదు. కన్నంపేటలో సుమారు 150 మంది మంచానపడి విలవిల్లాడుతున్నారు. 15 రోజుల క్రితం గ్రామంలో 40 మందికి జ్వరాలు సోకాయి.



    అప్పట్లో కొత్తకోట పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రత్యేక వై ద్యశిబిరం నిర్వహించారు. అప్పట్లో అదుపులోకి వచ్చిన జ్వరా లు ఇప్పుడు మళ్లీ కోరలు చాస్తున్నాయి. గ్రామానికి చెందిన చింతల రామునాయుడు (58) తీవ్ర జ్వరంతో సోమవారం రాత్రి మృతిచెందాడు. కొన్ని రోజులుగా జ్వరం, కీళ్లనొప్పులతో బాధపడుతున్నాడు. సరైన వైద్యం చేయించుకోలేదు.



    ఈ క్రమంలో బాగా నీరసించిపోయి మృతిచెందాడని ఎంపీటీసీ స భ్యుడు బంటు శ్రీను, సర్పంచ్ దంట్ల అరుణ తెలిపారు. సమాచారమిచ్చినా వైద్యసిబ్బంది స్పందించడం లేదని ఆరోపిం చారు. గ్రామంలో పైల శ్రీనివాసరావు, మట్టా రాజారావు , దంట్ల బుల్లిబాబు, మొలిపాక రామునాయుడు, ఉగ్గిన చిరంజీవిలతోపాటు సుమారు 150 మంది మంచానపడ్డారన్నారు.



    వమ్మవరం కాలనీకి చెందిన చెల్లిబోయిన దేముడమ్మ, అప్పికొండ శ్రీను, గల్లా నానాజి జ్వరంతో బాధపడుతూ ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద సేవలు పొందుతున్నా తగ్గడం లేద న్నారు. గతేడాదీ ఇదే దుస్థితి. అప్పట్లో జ్వరాలకు తాగునీరే కారణమని అధికారులు గుర్తించారు. గ్రామస్తులు తాగే బావినీటి శాంపిళ్లను తీసుకెళ్లారు. వాటి నివేదిక ఇప్పటికీరాలేదని సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు ఆరోపించారు. కాగా వడ్డిపలో సర్పంచ్‌తోపాటు అంగన్వాడీ కార్యకర్త మంచాన పడ్డారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

     

    కివర్లలో జ్వరాలు  

     

    అనంతగిరి : మండలంలోని మారుమూల పంచాయతీ కివర్ల పంచాయతీ పరిధిలో జ్వరాలు పీడిస్తున్నాయని కివర్ల ఎంపీటీసీ సభ్యురాలు   దురియా ఈశ్వరమ్మ తెలిపారు. మంగళవారం ఆ మే మాట్లాడుతూ పంచాయతీలోని అన్నిగ్రామాల్లో గిరిజనులు జ్వరాలతో బాధపడుతున్నారన్నారు. వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని కోరినా వైద్యసిబ్బంది పట్టించుకోలేదన్నారు. గిరిజనులప్రాణాలు గాలిలో కలిసి పోక ముందె వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top