‘క్రేన్‌’ అధినేత గ్రంథి సుబ్బారావు కన్నుమూత

‘క్రేన్‌’ అధినేత గ్రంథి సుబ్బారావు కన్నుమూత - Sakshi


తీవ్ర అనారోగ్యంతో గురువారం రాత్రి ఆస్పత్రిలో కన్నుమూత



సాక్షి, గుంటూరు: క్రేన్‌ సంస్థల అధినేత గ్రంథి సుబ్బారావు (87) తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం రాత్రి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. గత 15 రోజులుగా ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. క్రేన్‌ సంస్థలను స్థాపించి వేల మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉపాధి కల్పించారు. శుక్రవారం ఉదయం ఆయన పార్థివదేహాన్ని గుంటూరు సంపత్‌నగర్‌లోని క్రేన్‌సంస్థలో సందర్శనార్థం ఉంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సంతాపాన్ని ఆయన కుమారుడు గ్రంథి కాంతారావుకు తెలియజేశారు.  



రూ.150లతో మొదలైన ప్రస్థానం

1958లో అప్పటి గుంటూరులో రూ.150 పెట్టుబడి తో క్రేన్‌ వ్యాపారాన్ని గ్రంథి సుబ్బారావు మొదలు పెట్టారు. అది కూడా సైకిల్‌కు రెండు వక్కపొడుల సంచులు తగిలించుకుని ఊరంతా తిరిగి విక్రయించే వారు. అలా మొదలైన క్రేన్‌ ప్రస్థానం అంచెలం చెలుగా ఎదిగి అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. ప్రస్తుతం 300 మంది కార్మికులు వందల సంఖ్యలో డిస్ట్రిబ్యూటర్లు క్రేన్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో ఆవుపాలను, ప్రస్తుతం పెరుగును మార్కెట్‌లోకి విడుదల చేశారు. ‘స్వీయ సాధనలో’ అనే పేరుతో తన వ్యాపార విజయ ప్రస్థానాన్ని, ఔత్సాహిక వ్యాపారులకు ఇచ్చే సలహాలు, సూచనలతో పుస్తకం రచించారు.



టీటీడీ ధార్మిక మండలి సభ్యులుగా...

తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సలహా మండలి సభ్యులుగా గ్రంథి సుబ్బారావు ఉన్నారు.  గుంటూరు సంపత్‌నగర్‌లో అయ్యప్పస్వామి దేవ స్థానం నిర్మించి ప్రతిఏటా రోజుకు 4వేల మందికి చొప్పున 40 రోజులపాటు అయ్యప్పలకు భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే అంకిరెడ్డిపాలెం సమీపంలో భారీ వినాయకుడి మందిరం నిర్మించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top