‘మత్స్యకారుల సంక్షేమానికి కృషి’


 విజయనగరం మున్సిపాలిటీ: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోందని విజయనగరం మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అన్నారు. జిల్లా మత్స్యశాఖ ఆ ధ్వర్యంలో పట్టణంలోని కాటవీధి బెస్త కాలనీలో శుక్రవారం ప్రపంచ మత్స్య కార దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా చేపల పెంపకంపై జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో రూపొం దించిన కరపత్రాలను పంచారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడారు. కో ట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యా న్ని ఆర్జిస్తున్న రంగాల్లో ఆక్వా పరిశ్రమ ప్రధానమైనదని అన్నారు.



మత్స్యకారుల అభివృద్ధిలో భాగంగా విజయనగ రం పట్టణంలో ఆధునిక చేపల మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నా రు. పెద్ద చెరువులో చేపల పెంపకం చేపడుతున్న పలువురు రైతులు చెరువు కలుషితం కావటం వల్ల చేపలు చనిపోతున్నాయని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన చైర్మ న్ పట్టణంలో ప్లాస్టిక్ వ్యర్థాలు చెరువులో కలవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోం దని అన్నారు.



అనంతరం జిల్లా మత్స్య శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ కె.ఫణిప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలో మత్స్య కారులను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పరిచేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల సంభవించిన హుద్‌హుద్ తుపానుతో మత్స్యకారులు భారీగా నష్టపోయారని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా ఇక్కడ చేపల పకోడి, రొయ్యల పచ్చడి తయారు చేసే విధానంపై స్థానిక మత్స్యకార మహిళలకు నిపుణులతో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మత్స్య పరిశోధనాకేంద్ర అధికారి నాగభూషణం, మత్స్యకార అధికారి గోవిందరావు, మత్స్యకార సంఘాల నాయకులు పాల్గొన్నారు.

 

మత్య్సకారులకు వ్యానుల పంపిణీ

బొబ్బిలి: మత్స్యకారుల్లో మార్పులు తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి వారిని అభివృద్ధి చేయాలని మత్య్సశాఖ ఏడీ డాక్టరు కె.ఫణిప్రకాష్ కోరారు. బొబ్బిలి సహకార సంఘం డివిజన్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం సాయంత్రం డివి జన్ స్థాయి మత్య్సకారులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితవిప్లవం, క్షీర విప్లవాలు ముగిశాయని, ఇప్పుడు వస్తున్నది మత్య్సకారుల విప్లవమన్నారు.

 

జాతీయ మత్య్స అభివృద్ధి మండలి ద్వారా *5 లక్షల విలువైన వ్యానులను 75 శాతం రాయితీపై అందించామన్నారు. అలాగే మత్య్స సం పదను రవాణా కోసం ఎవరికైనా ద్విచక్రవాహనాలు కావాలంటే వారంతా దరఖాస్తులు ఇవ్వాలని, 40 శాతం రాయితీపై ఇస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తు తం 9 వేల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుందని వాటికంటే అధిక ఉత్పత్తిని సాధించడానికి ప్రయత్నించాలన్నారు.

 

రూ.200 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ: ఫణిప్రకాష్

రాష్ట్ర విభజన అనంతరం ఉత్తరాంధ్ర జిల్లాలోని మత్య్సకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం *200 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ పెడుతోందని, దానికి ఇప్పుడు ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఆ శాఖ అసిస్టెంటు డైరక్టరు డాక్టరు కె.ఫణి ప్రకాష్ తెలిపారు. ఆయన బొబ్బిలిలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఈ నిధులతో పంచాయతీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అనేక  అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయన్నారు.



జాతీయ మత్య్స అభివృద్ధి మండలి ద్వారా మత్య్సకారులకు లక్షలాది రూపాయల విలువైన వాహనాలు, ఇతన ఇన్‌ఫుట్స్ అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల తుపాను వల్ల 28 కోట్ల 50 లక్షల రూపాయల నష్టం మత్య్సకారులు, ఆయా గ్రామాలకు జరిగిందన్నారు. మొత్తం 160 చెరువుల్లోని రూ.76 లక్షల విలువైన మత్య్స సంపద పోయిందన్నారు. నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. జిల్లాలో 229 మైనర్ ఇరిగేషన్ చెరువులు, ఆరు రిజర్వాయర్లలో చేపలను పెంపకం చేపడుతున్నామన్నారు.

 

ఇవి కాకుండా ఇటీవల జన్మభూమిలో 4,400 చెరువుల్లో చేపల పెంపకం చేయాలని గుర్తించినట్లు తెలిపారు. రాజీవ్ కృషి వికాన యోజన పథకం కింద 463 చెరువుల్లో చేపల పెంపకానికి గుర్తించామన్నారు. వీటిలో 71 లక్షల 31 వేల రూపాయల విలువ చేసే చేప పిల్లలను వేయనున్నట్లు తెలిపారు. కృష్ణాజిల్లా నుంచి సీడ్ వస్తుందన్నారు. కార్యక్రమంలో ఆప్‌కాఫ్ డెరైక్టర్ సింగిం నరసింగరావు, కంచి వెంకటరావు తదితరులున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top