వివాహ విందులో అపశ్రుతి

వివాహ విందులో అపశ్రుతి - Sakshi


భోజనాలు కలుషితం

400 మందికి అనారోగ్యం

వాంతులు, విరేచనాలతో అస్వస్థత

నిండిపోరుున స్థానిక ఆస్పత్రులు

కోలవెన్నులో ఘటన

 


 

కంకిపాడు : ఓ వివాహ వేడుకలోని భోజనాల్లో ఆహారం కలుషితమై 400మంది అనారోగ్యం పాలైన ఘటన శనివారం రాత్రి మండలంలోని కోలవెన్నులో జరిగింది. గ్రామానికి చెందిన దివంగత తుమ్మల ఆంజనేయులు కుమారుడు మనోజ్ వివాహం శ్రీవర్షిణితో శుక్రవారం రాత్రి జరగ్గా, శనివారం వ్రతం చేసుకుని మూడు వేలమందికి భోజనాలు పెట్టారు. విందు ఆరగించిన వారికి సాయంత్రం 6 గంటల తరువాత వరుసగా వాంతులు, విరేచనాలు అయ్యూరుు. కంకిపాడు పరిసర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదు. విషయం తెలుసుకున్న పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, గ్రామ సర్పంచి, వైఎస్సార్ సీపీ నేత తుమ్మల చంద్రశేఖర్ అప్రమత్తమయ్యారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రతినిధులు, ప్రైవేటు వైద్యుల బృందం గ్రామానికి రప్పించారు. వినాయకస్వామి గుడి, కమ్యూనిటీ హాలు, దళితవాడ సెంటర్, కొత్తపేట ఏరియాల్లో రోగులు బారులు తీరారు. షామియూనాలు వేసి పరీక్షలు నిర్వహించారు. నీరసించిన వారికి సెలైన్లు పెట్టారు. బాధితుల్లో చిన్నారులు, మహిళలు, వృద్ధులే అధికంగా ఉన్నారు. ముగ్గురిని విజయవాడలోని కొత్త ప్రభుత్వాస్పత్రికి పంపగా, 11మంది చిన్నారులను పాత ఆస్పత్రికి పంపారు. అరుుతే, వారి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.   వైద్య శిబిరాలను వైద్యాధికారి జయప్రద పర్యవేక్షించారు. డీఎంహెచ్‌వో నాగమల్లేశ్వరి, ఎంపీపీ దేవినేని రాజా, తహశీల్దార్ రోజా, కంకిపాడు సీఐ రామ్‌కుమార్ తదితరులు భోజనాల్లోని తేడాను పరిశీలించారు. పెరుగు, ఐస్‌క్రీమ్, హల్వాలో తేడా ఉన్నట్లుగా పలువురు బాధితులు చెబుతున్నారు. కాగా, వైద్య శిబిరం వద్దకు వస్తున్న ఐదుగురు దళితవాడ వాసులను కుక్క కరిచింది. వారిని కూడా అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.



 వైఎస్సార్ సీపీ నేత సారథి పరామర్శ



 వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కె.పార్థసారథి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరును పరిశీలించారు. ఆందోళన చెందొద్దని బాధితులకు ధైర్యం చెప్పారు. జెడ్సీ చైర్ పర్సన్ గద్దె అనురాధ బాధితుల్ని పరామర్శించగా, కలెక్టర్ బాబు.ఎ ఫోన్‌లో ఎప్పటికప్పుడు విషయూలు తెలుసుకుంటున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top