కానిస్టేబుల్ అభ్యర్థులకు 1న ఫిజికల్ టెస్ట్

కానిస్టేబుల్ అభ్యర్థులకు 1న ఫిజికల్ టెస్ట్ - Sakshi


- ఓఎంఆర్ రీవెరిఫికేషన్ కోసం 23 లోగా దరఖాస్తు చేసుకోవాలి

- ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్



 సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 4,283 సివిల్, రిజర్వ్ పోలీస్ కానిస్టేబుళ్లు, జైళ్ల శాఖలోని 265 వార్డెన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో ఓఎంఆర్ షీట్ల రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 19 నుంచి 23 వ తేదీ ఐదు గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 6న నిర్వహించిన పరీక్ష ఫలితాలు 15న విడుదలైనట్లు తెలిపారు. రాతపరీక్షకు సంబంధించి అనుమానాలు ఉంటే ఏపీఆన్‌లైన్ (మీసేవ కాదు) ద్వారా రూ. 1,000 ఫీజుతో కలిపి ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  www.recruitment.appolice.gov.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్, అభ్యర్థి పేరు, తండ్రి పేరు, ఓఎంఆర్ షీటు రీవెరిఫికేషన్ కోరడానికి కారణం తెలియజేస్తూ ధరఖాస్తు చేసుకోవాలని వివరించారు.



రీవెరిఫికేషన్‌లో అభ్యర్థుల మార్కుల వివరాలను మొబైల్‌కు ఎస్‌ఎంఎస్, ఇమెరుుల్ ద్వారా తెలియజేస్తామన్నారు. మార్కులు పెరిగితే ఆ అభ్యర్థికి రీవెరిఫికేషన్ కోసం చెల్లించిన ఫీజు తిరిగి ఇస్తామన్నారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 1న ఫిజికల్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాత పరీక్ష సమయంలో ఓఎంఆర్ షీటులో సామాజికవర్గాన్ని తప్పుగా పేర్కొన్నట్టరుుతే www.recruitment.appolice.gov.in కు సామాజికవర్గాన్ని ధ్రువీకరించే పత్రాలను మెరుుల్ చేయాలని సూచించారు. ఫిజికల్ టెస్ట్‌కు వచ్చేటపుడు వాటికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top